శ్రీ చెన్నకేశవ స్వామి జాతర సందర్భంగా నిర్వహించిన కబడ్డీ పోటీలకు ముఖ్య అతిథులుగా హాజరైన.
అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు
మానవపాడు మండల పరిధిలోని బోరవెల్లి గ్రామంలో శ్రీ చెన్నకేశవ స్వామి జాతర సందర్భంగా నిర్వహించిన కబడ్డీ పోటీలకు హాజరై ప్రారంభించి రెండు టీమ్ లకు టాస్ ఎగరటం జరిగింది మరియు యూత్ సభ్యులు గ్రామ పెద్దలు సన్మానించడం జరిగినది.
ఎమ్మెల్యే మాట్లాడుతూ…
శ్రీ చెన్నకేశవ స్వామి జాతరను పురస్కరించుకొని కబడ్డీ పోటీలను నిర్వహించడం చాలా సంతోషకరం అన్నారు.
కబడ్డీ క్రీడాకారులు గెలుపు ఓటములను సమానంగా స్వీకరించాలి అని తెలిపారు.
అదేవిధంగా గ్రామ అభివృద్ధి కొరకు ప్రతి ఒక్కరు ఐక్యతతో గ్రామ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని పేర్కొన్నారు.
గ్రామ ప్రజలకు దేవుని ఆశీస్సులతో గ్రామంలోని రైతులు, ప్రజలు, అన్ని వర్గాల ప్రజలు దినదినాభివృద్ధి చెందాలని, ఆయురారోగ్యాలతో సంతోషాలతో అష్ట ఐశ్వర్యాలతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎంపీపీ అశోక్ రెడ్డి, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు బోరవెల్లి సత్యారెడ్డి,వైస్ ఎంపీపీ సోమన్న గౌడ్, మత్స్యశాఖ జిల్లా అధ్యక్షుడు గోపాల్,ఎల్లారెడ్డి, సీతారాముడు, మానవపాడు దామోదర్ రెడ్డి, వెంకట్రాముడు, అమరవాయి కాంతారెడ్డి, హరి ప్రసాద్ రెడ్డి, గోపాల్, మల్లికార్జున్ రెడ్డి రఘునాథ్ రెడ్డి, నరేందర్ రెడ్డి,గ్రామ పెద్దలు,బిఆర్ఎస్ పార్టీ నాయకులు ,వివిధ గ్రామాల ప్రజలు భారీ ఎత్తున పాల్గొన్నారు.