SAKSHITHA NEWS

పల్నాడు జిల్లా పోలీస్….

ఉద్యోగ విరమణ పొందిన హోంగార్డుకు ఊతం…

ఉద్యోగ విరమణ పొందిన హోంగార్డు వెంకట స్వామికి పోలీస్ శాఖ తరపున ఆర్ధిక సహాయంగా నగదు చెక్కు అందజేసిన పల్నాడు జిల్లా ఎస్పీ రవిశంకర్ రెడ్డి ఐపీఎస్,.

★ పోలీస్ శాఖలో గత 31 సంవత్సరాలుగా విధులు నిర్వహించి,ఉద్యోగ విరమణ పొందిన హోంగార్డు వెంకటస్వామి సేవలు అనిర్వచనీయమని ఎస్పీ తెలిపారు.

★ ఈ సందర్భంగా జిల్లాలో పనిచేస్తున్న హోంగార్డులు తమ సహోద్యోగికి ఆర్ధిక సహాయం అందించడానికి ఇచ్చిన తమ ఒకరోజు వేతనం రూ.5,45,280/-లను శ్రీ ఎస్పీ ఉద్యోగ విరమణ పొందిన హోంగార్డుకు అందజేసినారు.

★ హోంగార్డు వెంకట స్వామి కి ఆ భగవంతుడు నిండు ఆయురారోగ్యాలను,సుఖసంతోషాలను ప్రసాదించాలని,శేష జీవితాన్ని ఆనందంగా గడపాలని ఎస్పీ కోరారు.

★ సహోద్యోగుల సహకారం అభినందనీయమనీ, జిల్లాలో ఉన్న ప్రతి ఒక్క హోంగార్డుకు అభినందనలు తెలుపుతూ,ఇటువంటి ప్రోత్సాహం భవిష్యత్తులో కూడా కొనసాగేలా చూడాలని హోంగార్డు ఆరై రవికిరణ్ కి ఎస్పీ సూచించారు.

★హోంగార్డు సిబ్బంది అవసరాలను ఎప్పటికప్పుడు గుర్తించి, ఉన్నతాధికారుల ఆదేశానుసారం వాటిని తీరుస్తూ,వారి సంక్షేమానికి ఎంతగానో కృషి చేస్తున్న హోంగార్డు ఆరై రవికిరణ్ ని ఎస్పీ అభినందించారు.

ఈ కార్యక్రమంలో ఎస్పీ తో పాటు జిల్లా అదనపు ఎస్పీ(ఏఆర్) రామచంద్ర రాజు ,ఆరై రవికిరణ్ పాల్గొన్నారు.


SAKSHITHA NEWS