SAKSHITHA NEWS

Jesus is the divine form that brought the message of peace to the world

ప్రపంచానికి శాంతి సందేశాన్ని అందించిన దివ్య స్వరూపుడు యేసు
-క్రిస్మస్ వేడుకల్లో మాజీ ఎంపీ పొంగులేటి

సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్:

ప్రపంచానికి ప్రేమ, కరుణ, దయతత్వాన్ని పంచి… లోకానికి శాంతి సందేశాన్ని అందించిన దివ్య స్వరూపుడు యేసు క్రీస్తు అని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు, ఖమ్మం మాజీ పార్లమెంట్ సభ్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. ఉమ్మడి ఖమ్మంజిల్లా వ్యాప్తంగా ఆదివారం జరిగిన క్రిస్మస్ వేడుకల్లో పలు చోట్ల పొంగులేటి హాజరైయ్యారు. ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఖమ్మం నగరం శ్రీనివాసనగర్లోని రత్నగార్డెన్స్, మౌంట్ఫోర్డ్ ఆర్సీఎం చర్చిలో, కరుణగిరి చర్చిలో, వైరారోడ్ లోని ఆర్సీఎం చర్చిలో, కొత్తగూడెం సీఎస్ఐ చర్చిలో, పాల్వంచ సీఎస్ఐ చర్చిలో, ఇల్లందులోని ఎలీషాబాబా చర్చిలో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని కేక్ను కట్చేసి వేడుకలను ప్రారంభించారు. అనంతరం జరిగిన కార్యక్రమాన్ని ఉద్దేశించి పొంగులేటి మాట్లాడారు.

లోకంలో సమస్త ప్రజలందరూ శాంతియుతంగా జీవించాలని ఆయన ఆకాంక్షించారు. పండుగ సందర్భంగా ప్రజలందరి హృదయాలు ఆనందం, సంతోషంతో నిండాలని, భగవంతుని కరుణా కటాక్షాలు అందరిపై ఉండాలని ఆకాంక్షించారు. క్రైస్తవం అంటే… పక్కవారికి ప్రేమను పంచడం, తనకు తాను త్యాగం చేసుకోవడం, క్షమించడం అని అన్నారు. ఈ సందర్భంగా ఆయా చర్చిల పాస్టర్లు, ఫాదర్లు, బిషప్ లు ప్రత్యేక ప్రార్థనల అనంతరం పొంగులేటిని ఘనంగా సత్కారించారు. క్రిస్మస్ వేడుకలతో పాటు పలు ప్రయివేటు కార్యక్రమాల్లోనూ పొంగులేటి పాల్గొన్నారు.
ఈ పర్యటనలో పొంగులేటి వెంట బీఆర్ఎస్ రాష్ట్ర నాయకురాలు మద్దినేని బేబి స్వర్ణకుమారి, రాష్ట్ర నాయకులు వూకంటి గోపాలరావు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిషత్ ఛైర్మన్ కోరం కనకయ్య, వైస్ ఛైర్మన్ కంచర్ల చంద్రశేఖర్ రావు, డీసీసీబీ డైరెక్టర్ తుళ్లూరి బ్రహ్మయ్య, బొమ్మెర రామ్మూర్తి, ఆళ్ల మురళి, ఖమ్మం నగర కార్పొరేటర్లు దొడ్డా నగేష్, మలీదు జగన్, దుంపల రవికుమార్, మైనారిటీ నాయకులు షేక్ ఇమామ్ భాయ్, చింతమళ్ల గురుమూర్తి, మియాభాయ్, ఎయిర్టెల్ నరసింహారావు, బోడా శ్రావణ్ కుమార్, గురుప్రసాద్, బి.ఆదిత్య, ఫయాజ్, ఖమ్మం రూరల్ మండల నాయకులు అజ్మీరా అశోక్ నాయక్, మద్ది కిశోర్ రెడ్డి, తిప్పిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, కొత్తగూడెం నియోజకవర్గ నాయకులు యర్రం శెట్టి ముత్తయ్య, మంతపురి రాజుగౌడ్, తూము చౌదరి, ఎం.డీ. రజాక్, మైనారిటీ నాయకులు గౌస్ భాయ్, తాండ్ర నాగబాబు, తుమ్మల శివారెడ్డి, సందుపట్ల శ్రీనివాస్ రెడ్డి, తాళ్లూరి సత్యనారాయణ, ఇజ్జగాని రవిగౌడ్, తాళ్లూరి షణ్ముఖ చారి, బాలినేని నాగేశ్వరరావు, బాలు, భావ్ సింగ్ , దేవరగట్ల ప్రసాద్, ఎం. నరసింహా రెడ్డి, వీరభద్రం, కంచర్ల రాము, గాజుల రాం, శ్యామ్, దుగ్గిరాసి సతీష్, ఆడపా నవీన్ కుమార్, పండు, పాల సత్యనారాయణ రెడ్డి, కుశాల్, కల్లూరి సంపత్, సర్పంచ్ బండా వెంకటేశ్వర్లు, సత్తిరెడ్డి, బాలా పాసి తదితరులు ఉన్నారు.


SAKSHITHA NEWS