యువత ఓటు కీలకం అని జనసేన PAC ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు. కొత్తపేటలోని పార్టీ కార్యాలయంలో వివిథ కళాశాలల విద్యార్ధులతో ఓటరు క్యాంపెయిన్ పోస్టర్లను విడుదల చేసిన ఆయన మాట్లాడుతు ఈ సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో నాలుగు లక్షల మంది యువత కొత్త ఓటర్లుగా నమోదు అయ్యారని వారంతా మొదటి ఓటును తమ భవిష్యత్తును బంగారు మయం చేసే జనసేన పార్టీ వైపు వేస్తారని ఆశిస్తున్నామన్నారు,
యువతలో చైతన్యం నింపేలా జనసేన పార్టీ రాష్ట్ర వ్యాప్త క్యాంపెయిన్ ను నేటి నుంచి “My first vote for JANASENA” పేరుతో రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో ఈ చైతన్య కార్యక్రమం నిరంతరాయంగా యువతలోకి తీసుకువెళ్తామని నన్నారు. ఆయన మాట్లాడుతూ ” భవిష్యత్తు తరాల గురించి ఎంతో ఉన్నతమైన ఆలోచన ఒక ఉన్నతమైన దారిని ఏర్పాటు చేసేలా ఆలోచించే నాయకుడికి అండగా నిలిచేలా నేటి యువతరం ఉన్నతమైన ఆలోచన చేసి జనసేన పార్టీకి అండగా నిలబడాలన్నారు.
అనంతరం రాజకీయాలు ప్రస్తావిస్తూ జగన్ ప్రభుత్వం దిగటం ఖాయమని అంటూ ప్రజలకూ చేరువగా ఉండే సోషల్ మీడియాలో మాట్లాడితేనే TDP నాయకులపై భయంకర సెక్షన్లు పెడ్తున్నారని ఇదే పరిస్థితి తమకు భీమవరం, వైజాగ్ లలో ఎదురయ్యిందని , నాయకులను ఠాణాలకు పోలీసులు పిలవటం భావ్యం కాదని అన్నారు,
గతంలో ప్రతిపక్ష నాయకులను అవహేళన చేస్తు జగన్ పేదల హీరోగా చిత్రిస్తూ స్ధానిక నేత ప్రోద్బలంతో ఏర్పటు చేసిన పోష్టర్ విషయంలో తాము ఎంతో ఆవేదన చెందినా సంయమనం పాటించామని గుర్తు చేశారు.మరో ఆరు నెలలూ సంయమనం పాటించాలన్నారు.
ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి బండారు రవికాంత్, జిల్లా ఉపాధ్యక్షులు ఇస్మాయిల్ బేగ్, మాజీ కౌన్సిలర్లు హరిదాసు గౌరీ శంకర్, షేక్ జాకీర్ హుస్సేన్, జనసేన నాయకులుపసుపులేటి మురళీకృష్ణ, తెనాలి ,కొల్లిపర మండల అద్యక్షులు దివ్వెలమథుబాబు యర్రు వెంయ్య నాయుడు ప్రభృతులు పాల్గొన్నారు.
ఫోటో:-తెనాలి జనసేన పార్టీ కార్యాలయంలో ఓటరు క్యాంపైన్ లో నాదెండ్ల మనోహర్