SAKSHITHA NEWS

పిఠాపురంలో నేడు జనసేన ఆవిర్భావ సభ

ఆంధ్రప్రదేశ్ : పిఠాపురంలోని చిత్రాడలో శుక్రవారం జనసేన పార్టీ 12వ ఆవిర్భావ సభ జరగనుంది. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. మంత్రి నాదెండ్ల మనోహర్ పర్యవేక్షణలో సభ ఏర్పాట్లు జరిగాయి. జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మ.3 గంటలకు మంగళగిరి నుంచి బయలుదేరి.. 3.45 గంటలకు సభా స్థలికి చేరుకుంటారు. పార్టీ శ్రేణులను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. రాత్రికి కాకినాడలోని జేఎన్టీయూ గెస్ట్ హౌజ్‌లో బస చేయనున్నారు

JanaSena

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app