
భారత రాజ్యాంగ పరిరక్షణ సభకు ముఖ్య అతిథులుగా పాల్గొనాలని తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి మరియు కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కొలన్ హన్మంత్ రెడ్డి కు ఆహ్వాన పత్రం అందజేసిన జై భీమ్ మహాసేన మనవ హక్కుల పరిరక్షణ సంఘం ||
సాక్షిత : భారత రాజ్యాంగాన్ని ఆరో తరగతి నుంచి పదవ తరగతి వరకు ప్రత్యేక పాఠ్యాంశాలుగా చేర్చి బాల బాలికలకు భారత రాజ్యాంగం యొక్క విలువలు విశిష్టత తెలిసేలా రాజ్యాంగాన్ని పాఠ్యాంశంగా చేర్చాలని జరుగుతున్నది. కావున 1-03-2025 నాటికి 250 రోజులు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా మంచింటి అంజన్న ఏర్పాటు చేసిన భారత రాజ్యాంగ పరిరక్షణ సభకు ముఖ్య అతిథులుగా పాల్గొనాలని తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి మరియు కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కొలన్ హన్మంత్ రెడ్డి కు ఆహ్వాన పత్రం ఇచ్చి మర్యాదపూర్వకంగా ఆహ్వానించడం జరిగింది. అనంతరం పట్నం మహేందర్ రెడ్డి మరియు హన్మంతన్న స్పందించి కచ్చితంగా సభకు వస్తామని తెలిపారు . ఈ కార్యక్రమంలో మేయర్ శ్రీమతి కోలన్ నీలా గోపాల్ రెడ్డి , మేడ్చల్-జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బొంగునూరి శ్రీనివాస్ రెడ్డి, NMC అధ్యక్షులు కొలన్ రాజశేఖర్ రెడ్డి, డా. || అవిజె జేమ్స్,భూదాల అమర్ బాబు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు సిద్ధనోళ్ల సంజీవరెడ్డి, శ్రావణ్ కుమార్, బూదాల ఆనంద్ బాబు మరియు తదితరులు పాల్గొన్నారు.
