SAKSHITHA NEWS

సాక్షిత వికారాబాద్ జిల్లా తాండూర్ : తాండూర్ గంజి మార్కెట్ లో గల మార్కెట్ హాల్ లో ఉదయ 10-45 ని!!లకు మహాత్మ జోతిరావు పూలే 196 జయంతి బహు జనుల ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. ఇట్టి సమా వేశాము లో, బీసీ సంక్షేమ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు K. రాజకుమార్, సిపిఎం జిల్లా కార్యదర్శి K. శ్రీనివాస్, బీసీ సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, సయ్యద్ శుకూర్, బీసీ సంఘం మహిళ నాయకు రాలు జోతి , బీసీ సంఘం జిల్లా నాయకులు గడ్డం వెంకటేష్ , MRPS జిల్లా నాయకులు ఆనంద్ , స్పెరో శివ . PDSU జిల్లా నాయకులు P.శ్రీనివాస్ బీసీ సంఘం భషిర భాద్ నరేందర్ జై భీమ్ వెంకట్ తదితరులు పాల్గొన్నారు

ఈ సందర్బంగా పజాసంఘాల నాయకులు మాట్లాడుతూ,మహాత్మ జోతి రావు పూలె గొప్ప సంఘ సంస్కార్త, అంటరానికులాలవారి కొరకు, తన ఇంటి దగ్గర మంచి త్రాగేనీరు కొరకు, నీటి తోట్టెలు, ఏర్పాటు చేసి అందులోని నీరు అందరికి ఇచ్చే వారు, ఆకాలంలో మహిళల, అణగారిన కులాల హక్కులు కాల రాసి, చదువులు నిషేధం పెట్టారు అగ్రవర్ణలవారు,పూలే 1848 బాలికల కోసం పాఠశాల ప్రారంభించారు.వితంతు మహిళలకు, పునర్ వివాహము జరిపించాడు,” సత్య శోధక్ సమాజాన్ని “స్థాపించిన్నాడు.

దీన బంధు పత్రిక, నడిపించినాడు. అగ్ర వర్ణల వారు అనేక రకాల ఇబ్బంధులకు గురిచేశారు.తన సతీమని సావిత్రి భాయి పూలే కు, చదువు నేర్పించి నిమ్నకులాలకు అంటరాని వారికి చదువులు నేర్పించారు. నేడు ప్రభుత్వలు మహాత్ములా జయంతులు ఇరుపుచున్నప్పటికి, వారి ఆశయాలు కన్నా కలలు పూర్తిగా చేయడం లేదు,ప్రజాసంఘాలు నాయకులు, చత్రిపతి సాహు మహారాజ్, డా, B,R అంబేద్కర్, శివాజిమహారాజు, జోతిబాపూలే సమాజంకొరకు కులరహిత, మత రహిత, మూఢనమ్మకాలు,లేని చైతన్య సమాజం కొరకు పని చేయాలని పలువురు తెలిపారు.


SAKSHITHA NEWS