జగనన్న ఆరోగ్య సురక్ష ద్వారా పేద వర్గాల ప్రజలకు అందిస్తున్న వైద్య సేవలు ప్రసంశనీయమైన ఎస్సీ,ఎస్టీ ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు దేవరపల్లి సురేష్ బాబు తెలిపారు. ఘంటసాల మండలం ,పాప వినాశనం గ్రామంలో ఏర్పాటు చేసిన జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంపును సురేష్ బాబు శనివారం సందర్శించి అక్కడ అందిస్తున్న వైద్య సేవల గురించి అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా సురేష్ బాబు మాట్లాడుతూ ప్రస్తుత వాతావరణ పరిస్థితుల వల్ల ప్రజలు ఎదుర్కొంటున్న తీవ్రమైన సీజనల్ వ్యాధులకు,ఇతర అన్నిరకాల వ్యాధులకు ప్రభుత్వం ఎలాంటి ఖర్చు లేకుండా రక్త పరీక్షలు చేసి,మందులు పంపిణీ చేయడం హర్షణీయమన్నారు. ప్రభుత్వ వైద్య సేవలు అందుబాటులో లేకపోతే సీజనల్ వ్యాధుల వైద్య ఖర్చులకు ప్రైవేటు రక్త పరీక్ష కేంద్రాలు, ఆసుపత్రులలో ప్రజలు వేలాది రూపాయలు చెల్లించాల్సి వచ్చేదని తెలిపారు. వైద్య శాఖ సిబ్బంది ఇంటింటికి తిరిగి ఆరోగ్య సమస్యలను తెలుసుకోవడం, ప్రజల వద్దకు ప్రభుత్వ వైద్య సేవలు అందుబాటులో ఉండేలా రూపొందించిన ప్రభుత్వ విధానాలను అభినందించారు.
ప్రజలకు విద్య,వైద్యం అత్యంత ప్రాధాన్యత కలిగిన అవసరాలని సురేష్ బాబు తెలిపారు.జగనన్న వైద్య సురక్ష ద్వారా ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్న వైద్య ఆరోగ్యశాఖ సిబ్బందిని సురేష్ బాబు అభినందించారు. జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంపులో ఘంటసాల ఎంపీడీవో కె. సుబ్బారావు, తహసిల్దార్ రామ నాయక్ ,వైస్ ఎంపిపి కుంపటి నాగేంద్ర బాబు, సర్పంచ్ లు కుంపటి అనిత,రాచూరి ప్రసాదు,పంచాయితీ కార్యదర్శి డి. రమాదేవి, స్థానిక నేతలు జూనపూడి కిరణ్, జయరాం,కృష్ణ తదితరులు పాల్గొన్నారు.