బడుగు, బలహీన వర్గాల భవిష్యత్తు బాగు చేయడమే జగనన్న లక్ష్యం: ఎమ్మెల్యే నంబూరు శంకరరావు
అచ్చంపేట మండలం కోనూరులో ’మన కోసం మన శంకరన్న‘ కార్యక్రమం
కులం, మతం లేకుండా ప్రతి పేదవాడి భవిష్యత్తు బాగు చేయడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పనిచేస్తున్నారని పెదకూరపాడు శాసనసభ్యులు నంబూరు శంకరరావు అన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం అచ్చంపేట మండలం కోనూరులో నిర్వహించిన మన కోసం మన శంకరన్న కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా కోనూరులో పర్యటించినప్పుడు తన దృష్టికి వచ్చిన సమస్యల స్థితిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. సంక్షేమ పథకాలు అందలేదని ఫిర్యాదు చేసిన వారి సమస్యలు ఎంతవరకు పరిష్కారమయ్యాయో తెలుసుకున్నారు. పరిష్కరించిన సమస్యలను లబ్దిదారులకు తెలియజేశారు. ఎమ్మెల్యే నంబూరు శంకరరావు మాట్లాడుతూ.. ప్రతి గ్రామంలో గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్రం, హెల్త్ సెంటర్ నిర్మించి.. అన్ని రకాల సేవలను ఇంటి ముందుకే తెచ్చామన్నారు. హెల్త్ సెంటర్ల ద్వారా 60 రకాల వైద్యపరీక్షలు ఉచితంగా నిర్వహించి.. అవసరమైన మందులు కూడా ఉచితంగా ఇస్తున్నామన్నారు. పాఠశాలల రూపురేఖలు మార్చి నాణ్యమైన విద్య అందిస్తున్నామన్నారు. గత పాలకులు చేయలేని అమరావతి – బెల్లంకొండ డబుల్ రోడ్డును సాధ్యం చేసి చూపించామన్నారు.కోనూరులో ఇళ్ల స్థలాలు లేని వాళ్లు, సంక్షేమ పథకాలు అందని వాళ్ల సమస్యలు పరిష్కరించినట్టు తెలిపారు. అధికారులు కూడా ప్రతి నెలా గ్రామాల్లో పర్యటించి ప్రజల సమస్యలు తెలుసుకోవాలని సూచించారు. ప్రజలు కూడా ఏవైనా సమస్యలుంటే అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. అందరూ కలిసి గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలని కోరారు.