లబ్ధిదారులకు ఇంటి పట్టాల రిజిస్ట్రేషన్ పత్రాల పంపిణీ చేసిన నగర మేయర్ డాక్టర్ శిరీష
పేదల పక్షపాతి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని నగరపాలక సంస్థ మేయర్ డాక్టర్ శిరీష అన్నారు. తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలోని 27 డివిజన్ వార్డు సచివాలయంలో శుక్రవారం ఉదయం తిరుపతి నగర మేయర్ డాక్టర్ శిరీష పాల్గొని లబ్ధిదారులకు ఇంటి పట్టాల రిజిస్ట్రేషన్ పత్రాలను అందజేశారు.
ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ జగనన్న పేదల పక్షపాతి అని పేద మహిళలు సొంతింటి కళ నెరవేర్చిన ఘనత జగనన్నకే దక్కుతుందని తెలియజేశారు.
ఒక్క తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలోని 26 వేలమందికి ఇవ్వడం జరిగింది అని అలాగే 27 డివిజన్ పరిధిలో 202 మంది లబ్ధిదారులకు ఇంటి పట్టాల రిజిస్ట్రేషన్ పత్రాల అందజేయడం జరిగింది అని తెలిపారు. జగనన్న లేఅవుట్ లో ఇంటి పట్టాలు పొందిన లబ్ధిదారులకు రూపాయి ఖర్చు లేకుండా రిజిస్ట్రేషన్ చేసి సర్వహక్కులు కల్పించడం జరిగింది తెలియజేశారు. గతంలో ఏ ప్రభుత్వం హయాంలో అందించిన ఇంటి స్థలాలకు లబ్ధిదారులకు పేరున రిజిస్ట్రేషన్ చేసిన దాఖలాలు లేవని తెలిపారు. జరగబోయే ఎన్నికల్లో మరోసారి జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చేయవలసిన బాధ్యత మరియు తిరుపతి ఎమ్మెల్యే అభివృద్ధి భూమన అభినయ్ ను భారీ మెజార్టీతో గెలిపించి జగనన్నకు కానుక ఇవ్వాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మేయర్ తో పాటు వైఎస్ఆర్సిపి నాయకులు తులసి యాదవ్, భరణి యాదవ్, చింతా రమేష్, గీత యాదవ్, మునిశేఖర్,గజేంద్ర, నాగేశ్వరరావు, వార్డు సచివాలయం సిబ్బంది గోపాలకృష్ణ, పల్లవి, ఉషారాణి, రేవతి, నిరంజన్, గాయత్రి, రెడ్డి శేఖర్ తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app
SAKSHITHA NEWS
DOWNLOAD APP