SAKSHITHA NEWS

కమిషనర్ శ్రీమతి హరిత ఐఏఎస్ [

సాక్షిత : ప్రజలందరికీ మెరుగైన వైద్యం అందించాలని లక్ష్యంతో నిర్వహిస్తున్న జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంపులను సమర్థవంతంగా నిర్వహించాలని నగరపాలక సంస్థ కమిషనర్ శ్రీమతి హరిత ఐఏఎస్ అధికారులను ఆదేశించారు. నగరంలో జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంపుల నిర్వహణ, ప్రజలకు కల్పిస్తున్న సౌకర్యాలు తదితర అంశాలపై ఆరోగ్య శాఖ అధికారులు, సచివాలయ కార్యదర్శులతో కమిషనర్ సమీక్షించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలో ప్రజలందరికీ మెరుగైన వైద్యం అందించాలనే సదుద్దేశ్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంపులు నిర్వహిస్తున్నదని అన్నారు. సచివాలయం కార్యదర్శులు, వాలంటీర్లు జగనన్న ఆరోగ్య సురక్ష అప్ డౌన్లోడ్ చేసుకోవాలన్నారు.

మీకు కేటాయించిన గృహాలకు వెళ్ళి వైద్య పరీక్షలు నిర్వహించాలని అన్నారు. ఏమైనా ఆరోగ్య సమస్యలు ఉంటే వారిని.క్యాంపులకు తీసుకువచ్చి మెరుగైన వైద్యం అందించాలని అన్నారు. ఆరోగ్య సురక్ష క్యాంపులకు వచ్చే ప్రజలకు త్రాగునీరు అందుబాటులో ఉంచాలని అన్నారు. క్యాంపులు వద్ద మౌళిక సదుపాయాలు కల్పించాలని అన్నారు. ప్రజలు ఇబ్బందిపడకుందా తగు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో హెల్త్ ఆఫీసర్ డాక్టర్ అన్వేష్ రెడ్డి, సూపరింటెండెంట్ రవి, సచివాలయ కార్యదర్శులు, తదితరులు పాల్గొన్నారు.

Whatsapp Image 2023 10 17 At 6.41.36 Pm

SAKSHITHA NEWS