IT officer’s complaint against Mallareddy.. Case registered under various sections
మల్లారెడ్డి పై ఐటి అధికారి ఫిర్యాదు.. పలు సెక్షన్ల కింద కేసు నమోదు
హైదరాబాద్: తెలంగాణ కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డిపై బోయిన్పల్లి పోలీస్ స్టేషన్లో ఐటీ అధికారి ఫిర్యాదు చేశారు. జీరో ఎఫ్ఐఆర్తో ఈ కేసును దుండిగల్ పీఎస్కు బదిలీ చేశారు. తమ విధులకు ఆటంకం కలిగించారని ఐటీ అధికారి ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుతో 342, 353, 201, 203, 504, 506, 353, 379 రెడ్విత్ R/W 34 ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
ఐటీ అధికారులపై భద్రారెడ్డి ఫిర్యాదు
ఐటీ అధికారులపై మంత్రి మల్లారెడ్డి కుమారుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదులో తమపై ఐటీ అధికారులు దౌర్జన్యం చేశారని పేర్కొన్నారు. దీంతో ఐటీ అధికారులపై 384 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు.