SAKSHITHA NEWS

WhatsApp Image 2023 07 18 at 2.24.53 PM

గడచిన 45 సంవత్సరాల్లో తొలిసారి అన్నట్టుగా యునెస్కో ప్రపంచ వారసత్వ స్థలాల్లో ఒకటిగా పేరొందిన తాజ్‌ మహల్‌ గోడలను యమునా నదీ జలాలు తాకాయి. నదిలో పెరిగిన నీటి మట్టంతో దసెహ్రా ఘాట్‌ నీట మునిగింది. దీంతో రామ్‌బాగ్‌, ఎత్మాదుద్దౌలా, జోహ్రీ బాగ్‌, మెహ్‌తాబ్‌ బాగ్‌ లాంటి స్మారక కట్టడాలకు ముంపు పొంచి ఉన్నది. పియోఘాట్‌లో మోక్షధామ్‌, తాజ్‌గంజ్‌ స్మశాన వాటికలను వరద నీరు ముంచెత్తడంతో మరణించిన ఆప్తులకు అంత్యక్రియలు నిర్వహించడంలో ప్రజల ఇబ్బందులు పెరిగాయి. యమునా నదిలో నీటి మట్టం మరింత పెరిగిన పక్షంలో తాజ్‌మహల్‌ ఎదురుగా ఉన్న కైలాష్‌ ఘాట్‌తో పాటుగా ఆ చుట్టపక్కల ఉన్న మరో 27 స్మారక కట్టడాలకు ముంపునకు గురయ్యే అవకాశం ఉందనే అనుమానాలు స్థానికుల్లో తలెత్తాయి.


SAKSHITHA NEWS