SAKSHITHA NEWS

పోస్టల్ ఇన్స్పెక్టర్ రమేష్

ఇటీవల భారత ప్రభుత్వము, తపాలా శాఖలో ఉన్న అన్ని రకాల పొదుపు ఖాతాల యొక్క వడ్డీ రేట్లను భారీగా పెంచింది. ఈ పెరిగిన వడ్డీ రేట్లు తేదీ: 01.04.2023 నుండి అమలులోకి వస్తున్నట్లు నర్సంపేట పోస్టల్ ఇన్స్పెక్టర్, యస్. రమేష్, తెలిపారు. ఈ సంధర్భంగా, వారు మాట్లాడుతూ, ప్రస్తుతము పెరిగిన పోస్టాఫీసు సేవింగ్ ఖాతా యొక్క వడ్డీ రేటును 4 శాతం గాను, రికరింగ్ డిపాసిట్ 6.2 శాతం, ఫిక్సెడ్ డిపాసిట్ 1, 2, 3, 5 సంవత్సరాలకు గాను 6.8 శాతం, 6.9 శాతం, 7.0 శాతం, 7.5 శాతం గా పెంచినారు. నెలవారి ఆదాయ పథకం వడ్డీ రేటు 7.1 శాతం నుండి 7.4 శాతం గా, సీనియర్ సిటిజను సేవింగ్స్ పథకము యొక్క వడ్డీ రేటు 8.0 శాతం నుండి 8.2 శాతం గా పెంచినారు. కిసాన్ వికాస పత్రము వడ్డీ రేటు 7.2 శాతం నుండి 7.5 శాతం కు , నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ వడ్డీరేటు 7.0 శాతం నుండి 7.7 శాతం కు , అత్యధిక అధరణ పొందిన, బాలికల అబివృద్దికి ప్రవేశ పెట్టిన సుకన్య సమృద్ది యోజన పథకం యొక్క వడ్డీ రేటు ను 7.6శాతం నుండి 8.0శాతం గా పెంచినారు.

మహిళల కోసం సరికొత్త పథకము “మహిళా సమ్మాన సేవింగ్స్ సర్టిఫికేట్”

మహిళల స్వయం అభివృద్ది ధ్యేయంగా కేంద్ర ప్రభుత్వము పోస్టల్ శాఖ ద్వారా సరికొత్త పథకము “మహిళా సమ్మాన సేవింగ్స్ సర్టిఫికేట్” ను ప్రారంభించినది. ఈ 2023 సంవత్సరపు బడ్జెట్ లో ఈ కొత్త పొదుపు పథకం ప్రత్యేకంగా మహిళల కోసం ప్రవేశపెట్టబడింది. ఈ పథకం లో కనీస పెట్టుబడి Rs 1000/- గరిష్టంగా Rs.200000/- వరకు పెట్టుబడి పెట్టుకోవచ్చు. రెండు సంవత్సరాల పెట్టుబడికి గాను ప్రస్తుత ఆకర్షనీయమైన వడ్డీ 7.5 శాతం గా నిర్ణయించినారని , ఈ పోస్టాఫీసు పథకాలను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని నర్సంపేట పోస్టల్ ఇన్స్పెక్టర్ యస్. రమేష్ వివరించినారు. ఈ కార్యక్రమంలో నర్సంపేట పోస్ట్ మాస్టర్ దార్ల రాజేందర్, మెయిల్ ఓవర్ సీర్ అశోక్, వీరభద్రయ్య, సురేష్, రవి, అనూష, లావణ్య, మరియు పోస్టల్ సిబ్బంది పాల్గొన్నారు.


SAKSHITHA NEWS