SAKSHITHA NEWS

It is suggested that women's groups should be strengthened in the agency areas

ఏజెన్సీ ప్రాంతాల్లో ఇంకా మహిళా సంఘాలు బల పడాలని సూచన
బ్యాంకర్లు వెళ్లి మహిళా సంఘాలకు లోన్లు ఇవ్వాలని ఆదేశం
బ్యాంకుల ద్వారా రుణాలను ఇప్పించే బాధ్యత ప్రభుత్వానిదేనని మంత్రి స్పష్టం
మహిళా స్వయం సహాయక సంఘాలకు ఈ ఏడాది 20 వేల కోట్ల రుణాలు అందించాలన్న లక్ష్యాన్ని పెట్టుకున్నట్లు రాష్ట్ర పంచాయితీ రాజ్, గ్రామీణాభివృద్ధి మ‌రియు మ‌హిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ (సీతక్క) తెలిపారు. గత ఏడాది కేవలం 15,400 కోట్ల రుణాలు ఇచ్చారని వెల్లడించారు. 2024-25 ఆర్థిక సంవత్సర రుణ ప్రణాళికను సీతక్క శనివారం విడుదల చేశారు. అనంతరం ఆమె మాట్లాడారు. ఒకప్పుడు మహిళా సంఘాలకు రూ. పది వేల లోన్ ఇవ్వాలంటేనే బ్యాంకులు భయపడేవన్నారు. ఇప్పుడు మహిళా సంఘాలకు రూ. 20 లక్షల వరకు రుణాలు అందుతున్నాయన్నారు. మహిళా సంఘాలు మహిళల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచడమే కాదు.. ఐక్యతను అభివృద్ధిని సాధిస్తున్నమని సీతక్క తెలిపారు. పేదలకు పేదలే బందువులుగా ఉంటారన్నారు. అందుకే పేదలకు ప్రభుత్వమే అండగా ఉండి అభివృద్ధి పథాన నిలపాలన్నదే మా సంకల్పమని స్పష్టం చేశారు.

WhatsApp Image 2024 06 15 at 15.46.13

SAKSHITHA NEWS