తెలంగాణ రాష్ట్ర అవతారణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా భారాస పార్టీ అధినేత ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు మరియు మంత్రి భారాస పార్టీ కార్య నిర్వాహక అధ్యక్షులు కల్వకుంట్ల తారక రామారావు ఆదేశాల మేరకు.. శేరిలింగంపల్లి శాసన సభ్యులు ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ మరియు 124 డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ పిలుపు మేరకు తెలంగాణ రాష్ట్ర అవతారణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా ఎల్లమ్మబండ ప్రభుత్వ పాఠశాలలో నిర్వహించిన విద్య దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిధిగా యువనేత దొడ్ల రామకృష్ణ గౌడ్ పాల్గొని ఎల్లమ్మబండ ప్రభుత్వ పాఠశాలలో ఈ సంవత్సరం పదోవ తరగతి పరీక్షలలో వందశాతం ఉత్తీర్ణత సాధించిన తెలుగు, హిందీ, మాథ్స్ మరియు సోషల్ ఉపాధ్యాయులను సన్మానించడం జరిగింది.
ఈ సందర్భంగా యువనేత మాట్లాడుతూ పదోవ తరగతి పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించడానికి సహకరించిన ఉపాధ్యాయులను అభినందించారు. పాఠశాల ప్రాంగణంలో మీటింగ్ లు జరిగినప్పుడు పిల్లలు ఎండలో కూర్చోవడం గమనించిన యువనేత ఇటీవల స్వర్గస్తులైన వారి తాత దొడ్ల రాంచందర్ గౌడ్ జ్ఞాపకార్థం పాఠశాలకు రెండు టెంట్లు అందిస్తానని హామీ ఇవ్వడం జరిగింది. అలాగే డిజిటల్ క్లాస్ రూంలు ఏర్పాటులో భాగంగా పాఠశాలలోని మూడు తరగతి గదులలో నూతనంగా ఏర్పాటు చేసిన డిజిటల్ బోర్డ్ లను యువనేత రిబ్బన్ కట్ చేసి ప్రారంబించడం జరిగింది. అనంతరం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందించిన ఉచిత పాఠ్య పుస్తకాలను ఆరోవ తరగతి విద్యార్థులకు పంపిణీ చేయడం జరిగింది. కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు సమ్మారెడ్డి, గౌరవ అధ్యక్షులు అనిల్ రెడ్డి, మాజీ అధ్యక్షులు పాండుగౌడ్, ఉపాధ్యక్షులు చిన్నోళ్ల శ్రీనివాస్, బిఆర్ఎస్ నాయకులు శివరాజ్ గౌడ్, షౌకత్ అలీ మున్నా, అగ్రవాసు, ప్రదీప్ రెడ్డి, వాలి నాగేశ్వరరావు, రవీందర్, కటిక రవి, దేవేందర్, భిక్షపతి, కూర్మయ్య, కరుణాకర్, అలీ, యాకుబ్, డివిజన్ మహిళా అధ్యక్షురాలు మధులత, స్వరూపా రాణి, ZPHS HM శ్రీమతి కె.రాధ పద్మజ, ప్రైమరీ స్కూల్ HM డి.గోవింద్, ఉపాద్యాయులు కె.కె.మోహన్ రావు, ఆనంతయ్య, వెంకటేశ్వర్లు, రాంచందర్, రాములు, గోవింద్, కిరణ్మయి, సుధారాణి, సుజాత తదితరులు పాల్గొన్నారు.