SAKSHITHA NEWS

హైదరాబాద్
దేశవ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికలతో పాటు పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో మే 13న ఎన్నికలు జరుగుతున్నాయి.

ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో దేశవ్యాప్తంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సెలవులు రద్దయ్యాయి.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన ప్రభుత్వ, సెమీ ప్రభుత్వ శాఖలు, ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేస్తున్న అధికారులు, ఉద్యోగుల సెలవులను నిషేధిస్తూ జిల్లా ఎన్నికల అధికారులు, కలెక్టర్లు ఉత్తర్వులు జారీ చేశారు.

ఎన్నికలకు సంబంధించిన ఉత్తర్వులు, మెయిల్స్‌, ఇతర సమాచారాన్ని అందించేందుకు అన్ని ప్రభుత్వ కార్యాలయాలు సెలవు దినాల్లో కూడా పని చేయాలని సూచించారు. ఈ ఉత్తర్వులు వెంటనే అమలులోకి వస్తాయని తెలిపారు.

WhatsApp Image 2024 03 20 at 2.00.59 PM

SAKSHITHA NEWS