SAKSHITHA NEWS

అన్నదాతకు ఏ కష్టం వచ్చినా అండగా నిలిచే నేను రైతు ద్రోహినంట*
ఎవరు రైతు ద్రోహినో, ఎవరు రైతు బాందవుడో, ఎవరిని ప్రజలు తరిమికొడుతారో మరికొద్ది నెలల్లో సర్వేపల్లి ప్రజలే తేల్చబోతున్నారు
సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి
ఎవరు పోతే ఊళ్లలో ప్రజలు తరుముకుంటున్నారో..నేలటూరులో అందరూ చూశారు
రైతుల దగ్గర పుట్టికి 200 కిలోల ధాన్యం దోచుకున్న కాకాణి పెద్దమనిషంట..క్వింటాలుకు రూ.210, పుట్టికి రూ.1740కి బోనస్ ఇప్పించిన నేను రైతు ద్రోహినంట


వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2020లో ధాన్యం ధర పుట్టి రూ.8 వేలు నుంచి రూ.6 వేలకు పడిపోయినప్పుడు ఆయనకు రైతుల కష్టాలు కనిపించలేదు..అప్పుడు బ్రోకర్లు మాత్రమే కనిపించారు
టీడీపీ ప్రభుత్వ హయాంలో స్థానికంగా ధాన్యానికి డిమాండ్ లేక ధరలు తగ్గితే దేశంలో ఎక్కడైనా అమ్ముకునే అవకాశం కల్పించాం..రవాణాపరంగా ఎదురైన అవాంతరాలను స్వయంగా సమీక్షించి రైతుకు ఇబ్బంది లేకుండా చేశాం
ఇబ్బందుల్లో ఉన్న రైతుని గాలికి వదిలేసిన ఆయన రైతుబాంధవుడంట..ఎప్పటికప్పుడు సమస్యలు పరిష్కరించిన నేను రైతు ద్రోహినంట


కరోనా విపత్తు సమయంలో అన్నదాతలతో పాటు ప్రజలందరూ కష్టాల్లో ఉన్నప్పుడు కూడా ఎకరాకు తూము ధాన్యాన్ని బలవంతంగా కలెక్షన్ చేసిన కాకాణి కూడా రైతుల గురించి మాట్లాడటం సిగ్గుచేటు
మా హయాంలో పుట్టికి 860 కిలోల ధాన్యాన్ని కొలిచాం..వారం రోజుల్లో రైతుల ఖాతాల్లో నగదు జమ చేశాం
మీ ప్రభుత్వ హయాంలో పుట్టికి 1000 నుంచి 1100 కిలోల వరకు కొలుచుకుంటున్నారు..ఆర్నెళ్లకు కూడా డబ్బులు రాకపోవడంతో రైతులు పడిగాపులు కాయాల్సిన దుస్థితి
వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మూడేళ్లలో ఏ ఒక్క పంటలో అయిన రైతుకు గిట్టుబాటు ధర ఇప్పించగలిగావా..ప్రభుత్వానికి ధాన్యం విక్రయిస్తే పుట్టికి 200 కిలోలు అదనంగా గుంజకుండా వదిలిపెట్టావా
ఇప్పుడేదో రష్యా – ఉక్రెయిన్ యుద్ధం, యూరప్ లో కరువు కారణంగా కొన్ని వెరైటీల ధాన్యానికి ఉపశమనం లభించింది


సోమశిల జలాశయంలో 52 టీఎంసీలు నీళ్లు నిల్వ ఉన్నాయని రెండో పంటకు 2.85 లక్షల ఎకరాలకు నీళ్లిస్తామని ఐఏబీ సమావేశంలో ప్రకటించినా, మీ ముఖాల మీద నమ్మకం లేక రైతులు 1.05 లక్షల ఎకరాలకే పంటను పరిమితం చేసుకున్నారు.
రైతులు పంట వేయకపోయినా 27 టీఎంసీల నీళ్లు ఏమయ్యాయో తెలియదు..మీరు రైతుల గురించి మాట్లాడటం హాస్యాస్పదం
ఎవరు ఎవరికి ద్రోహం చేస్తున్నారో…ఎవరు ఎవరిని తరిమికొడుతున్నారో మరికొద్ది నెలల్లో జరగనున్న ఎన్నికల్లో తెలుస్తుంది


కాకాణి గోవర్ధన్ రెడ్డి కనుసన్నల్లో సర్వేపల్లి నియోజకవర్గంలో భూకుంభకోణాలు పెరిగిపోవడం అక్షర సత్యం
కాకాణి జివానికి ఇప్పటికే అనేక మంది పోలీసు, రెవెన్యూ అధికారులు బలైపోయారు. మరికొందరు బలికాబోతున్నారు
భూకుంభకోణాలు, ఇతర అక్రమాల్లో కాకాణికి సహకరించి పాపాలు చేసిన అధికారులకు అవే శాపాలుగా మారాయి
అక్రమాలు చేయించిన కాకాణి గోవర్ధన్ రెడ్డి వందల కోట్లు పెట్టి భవంతులు కట్టుకుంటున్నాడు..ఆ పాపాల్లో భాగస్వాములైన అధికారులను మాత్రం బలి చేస్తున్నాడు
,,,,,,,,,,


SAKSHITHA NEWS