SAKSHITHA NEWS

మందులు లేకుండా బస్తి దావఖానలు నడిపించడం వృధా.
సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి ఉమా మహేష్.

సాక్షిత : సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో నేడు శ్రీనివాస్ నగర్ ఈ సేవ సెంటర్ వద్ద ఉన్నా బస్తి దావఖాన ను సందర్శించడం జరిగింది.
  పేద ప్రజలకు వైద్యాన్ని ఉచితంగా అందుబాటులో ఉంచడానికి గత ప్రభుత్వం ఢిల్లీ తరహాలో బస్తి దావఖానలను ప్రారంభించడం జరిగింది.కానీ నేడు ఆ బస్తి దావఖనలో కనీసం బీపీ,షుగర్ లాంటి మందులు కూడా లేవని ప్రజలు రోగులు నిత్యం మందులు లేవని తిరిగి వెళ్ళిపోతున్నారని,ఉన్న మందులు  కనీసం 10రొజులకు కూడా సరిపోవట్లేదని అలాగే రక్త పరీక్షలు కూడా సరిపోను చెయ్యట్లేదని దానికి సరిపడా సైరాంజీ లు లేవని డాక్టర్,లాబ్ అసిస్టెంట్ చెపుతున్నారని దీని వల్ల ప్రజలకు ఉపయోగమే లేకుండా పోయిందని కావున అధికారులు తక్షణమే స్పందించి రోగులకు సరిపడా నాణ్యమైన మందులను సరఫరా చెయ్యాలని,ప్రభుత్వానికి చేతకాకపోతే ప్రజలను మభ్యపెట్టకుండా ఆసుపత్రిలను మూసుకోవాలని అన్నారు.

డిస్ట్రిక్ట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ కి ఫోన్ లో సిపిఐ నాయకత్వం సంప్రదిస్తే నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారని,ఇలాంటి డి ఎమ్ హెచ్ ఓ   వల్ల ప్రజలకు ఉపయోగం లేదని ఇలాగే వ్యవహరిస్తే పై అధికారులకు పిర్యాదు చేస్తామని హెచ్చరించారు.
     ఈ కార్యక్రమంలో సిపిఐ కార్యవర్గ సభ్యులు సదానంద్, సహాదేవ్ రెడ్డి,మునిసిపల్ అధ్యక్షుడు రాములు,జైపాల్ రెడ్డి,ప్రజానాట్యమండాలి బాబు,స్థానికులు కయ్యుమ్,క్రాంతి,ఇమామ్ లు పాల్గొన్నారు.

SAKSHITHA NEWS