SAKSHITHA NEWS

తెలంగాణ ప్ర‌జ‌లు కేసీఅర్ వెంటే అని మరో మారు నిరూపితం అయ్యింది..

మునుగోడు విజ‌యం సీయం కేసీఆర్ నాయ‌క‌త్వంపై ఉన్న విశ్వాసానికి నిదర్శ‌నం.

తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీలకు స్థానం లేద‌ని మ‌రోసారి స్ప‌ష్టమైంది.

బీఆర్ఎస్ జైత్రయాత్రకు మునుగోడు గెలుపే నాంది కానుంది.

కూసుకుంట్ల ప్ర‌భాకర్ రెడ్డికి శుభాకాంక్ష‌లు తెలిపిన మంత్రి పువ్వాడ అజయ్ కుమారు

సాక్షిత ఖమ్మం బ్యూరో చీఫ్

మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్ గెలుపొందడం పట్ల రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ హర్షం వ్యక్తం చేశారు.

మునుగోడు విజయం ద్వారా ప్రజలకు ముఖ్యమంత్రి కేసిఆర్ నాయకత్వం పైన ఉన్న విశ్వాసానికి నిదర్శనంగా నిలిచిందని, గత కొంతకాలంగా ప్రభుత్వంపై ప్రతిపక్షాలు చేసిన విమర్శలకు ప్రజలే ఓట్ల రూపంలో సమాధానం చెప్పారన్నారు.

ఎవ‌రు ఎన్ని కుట్ర‌లు, కుయుక్తులు ప‌న్నినా ఎప్ప‌టికీ ధ‌ర్మంమే గెలుస్తుంద‌ని మునుగోడు ప్ర‌జ‌లు నిరూపించార‌ని మంత్రి పువ్వాడ స్పష్టం చేశారు.

బీఆర్ఎస్ జాతీయ పార్టీ దేశ వ్యాప్త‌ జైత్రయాత్రకు మునుగోడు గెలుపే నాంది కానుంద‌ని, దేశ రాజకీయాలలో ముందుకు నడిచేందుకు మునుగోడు విజయం ద్వారా ప్రజలు తమ ఆమోదం తెలిపారని పేర్కొన్నారు.

దేశ రాజకీయాల్లో కూడా సీయం కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ ఖచ్చితంగా ప్రధాన పాత్ర పోషించ‌నుంద‌ని, ఈ దేశానికి తెలంగాణ ఒక దిక్సూచిగా నిల‌వ‌నుంద‌ని స్ప‌ష్టం చేశారు.

తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీలకు స్థానం లేద‌ని, తెలంగాణలో ఉన్నది టీఆర్ఎస్ మాత్రమే అని మ‌రోసారి నిరూపితమైంద‌న్నారు.

టీఆర్ఎస్ అభ్య‌ర్థి గెలుపునకు కృషి చేసిన‌ ఖమ్మం ప్రజాప్రతినిధులకు, కార్పొరేటర్లకు, నాయకులకు, కార్యకర్తలకు, టీఆర్‌ఎస్ శ్రేణులకు పేరుపేరునా ద‌న్య‌వాదాలు తెలిపారు.

మునుగోడులో విజయం సాధించి ఎమ్మేల్యేగా గెలుపొందిన కూసుకుంట్ల ప్ర‌భాక‌ర్ రెడ్డికి ప్రత్యేక శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు.

ఖమ్మం నగరంలో తెరాస శ్రేణుల భారీ ర్యాలీ..

మునుగోడు ఉపఎన్నికల్లో తెరాస అభ్యర్థి కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గెలుపును పురస్కరించుకుని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆదేశాల మేరకు ఖమ్మం నగర కమిటి అధ్వర్యంలో నగరంలో మోటార్ సైకిల్స్ తో భారీ ర్యాలీ ప్రదర్శన నిర్వహించారు.

శ్రేణులు ఆనందోత్సవాల నడుమ బాణాసంచా కాలుస్తూ.. మిఠాయిలు తినిపించుకుంటు సంబరాలు జరుపుకున్నారు. అన్ని ప్రధాన కూడళ్లో బాణసంచా కాల్చి జై తెలంగాణ.. జై కేసీఅర్.. జై పువ్వాడ అంటూ నినాదాలు చేశారు.

వీడియోస్ కాలనీ లోని మంత్రి పువ్వాడ క్యాంపు కార్యాలయం నుండి ఇల్లందు సర్కిల్, కలెక్టరేట్, జడ్పీ సర్కిల్, జమ్మిబండ, చెరువు బజార్, బొనకల్ క్రాస్ రోడ్, చర్చ్ కాంపౌండ్, జహీర్ పురా పార్క్, కిన్నెరసాని, గాంధీ చౌక్, పి ఎస్ ఆర్ రోడ్, గుంటి మల్లేశ్వరస్వామి దేవాలయం, నయాబజార్, జూబ్లీ క్లబ్, మయూరి సెంటర్ పాత బస్ స్టాండ్, పాత ఎల్ఐసి ఆఫీస్ మీదగా తెరాస జిల్లా పార్టీ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు.

జిల్లా పార్టీ కార్యాలయంలో శ్రేణులు బాణసంచా కాల్చి స్వీట్స్ పంపిణీ చేశారు. రంగులు చల్లుకుని సంబరాలు జరుపుకున్నారు.


SAKSHITHA NEWS