SAKSHITHA NEWS

రాహుల్ గాంధీ , ప్రేమను పంచడం అంటే ఇదేనా?: వీడియోను ట్వీట్ చేసిన కేటీఆర్

హైడ్రా కూల్చివేతలపై కేటీఆర్ నిలదీత

మహిళలు ఇంట్లో ఉండగానే ఇళ్లను కూల్చుతున్నారంటూ ఆగ్రహం

మీ కుటుంబంలో ఇలాంటి ఘటనలు జరిగితే అంగీకరిస్తారా? అని ప్రశ్న

పేదలకు ప్రేమను పంచడం అంటే ఇదేనా? అంటూ లోక్ సభలో ప్రతిపక్ష నేత, ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. హైడ్రా పేరుతో రేవంత్ ప్రభుత్వం చేపడుతున్న కూల్చివేతలపై కేటీఆర్ నిలదీశారు.

తెలంగాణలో ఇంట్లో ఇద్దరు మహిళలు ఉండగానే బుల్డోజర్‌తో ఇళ్లను కూలగొట్టారని, ఆ మహిళల భౌతిక భద్రతకు ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు.

ఇలాంటి ఘటనలు మీ కుటుంబంలో జరిగితే అంగీకరించగలరా? అని రాహుల్ గాంధీని ప్రశ్నించారు. పట్టింపు, మానవత్వం లేని ప్రభుత్వాలే ఇలాంటి చర్యలకు పాల్పడతాయని విమర్శించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను కూడా కేటీఆర్ పోస్ట్ చేసి రాహుల్ గాంధీని ట్యాగ్ చేశారు


SAKSHITHA NEWS