ఇజ్రాయెల్‌పై ఇరాన్ దాడికి సమయం చూసి తప్పక ప్రతిదాడిచేస్తామని ఇజ్రాయెల్ ప్రకటించింది. ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు నిర్ణయం కోసం వేచిచూస్తున్నామంటూ ఇజ్రాయెల్ ఆర్మీ చీఫ్ హెర్జి హలేవి సోమవారం ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఇరాన్ సంచలన ప్రకటన చేసింది. ఇజ్రాయెల్ నుంచి ఎలాంటి దాడి జరిగినా సెకన్ల వ్యవధిలోనే ప్రతిస్పందిస్తామని, అవసరమైతే ఇదివరకెప్పుడూ ఉపయోగించని ఆయుధాలను సైతం మోహరిస్తామని ఇరాన్ హెచ్చరించింది.
ఈ మేరకు ఇరాన్ ప్రభుత్వ సీనియర్ అధికారి అబోల్ఫజల్ అమౌ కీలక ప్రకటన విడుదల చేశారు. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సమగ్ర వ్యూహాలను రూపొందించుకున్నామని, ఇజ్రాయెల్ ఎలాంటి దాడి చేసినా గతంలో వాడని ఆయుధాలను కూడా ఉపయోగించేందుకు సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు.
ఇజ్రాయెల్‌పై ఇరాన్ దాడికి సమయం చూసి తప్పక ప్రతిదాడిచేస్తామని ఇజ్రాయెల్ ప్రకటించింది. ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు నిర్ణయం కోసం వేచిచూస్తున్నామంటూ ఇజ్రాయెల్ ఆర్మీ చీఫ్ హెర్జి హలేవి సోమవారం ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఇరాన్ సంచలన ప్రకటన చేసింది. ఇజ్రాయెల్ నుంచి ఎలాంటి దాడి జరిగినా సెకన్ల వ్యవధిలోనే ప్రతిస్పందిస్తామని, అవసరమైతే ఇదివరకెప్పుడూ ఉపయోగించని ఆయుధాలను సైతం మోహరిస్తామని ఇరాన్ హెచ్చరించింది. ఈ మేరకు ఇరాన్ ప్రభుత్వ సీనియర్ అధికారి అబోల్ఫజల్ అమౌ కీలక ప్రకటన విడుదల చేశారు. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సమగ్ర వ్యూహాలను రూపొందించుకున్నామని, ఇజ్రాయెల్ ఎలాంటి దాడి చేసినా గతంలో వాడని ఆయుధాలను కూడా ఉపయోగించేందుకు సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు.