పాటల పల్లకిలో ఐక్యూ
మధ్య తరగతికి చెందిన ఓ అమ్మాయి తన తెలివితేటలతో ప్రపంచస్థాయి గుర్తింపు ఎలా తెచ్చుకుంది? అనే కథాంశంతో ఐక్యూ సినిమా తెరకెక్కుతోంది. కాలేజ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ‘ఐక్యూ’ చిత్రంలో కాయగూరల సాయిశరణ్, పల్లవి, ట్రాన్సీ హీరో హీరోయిన్లు. శ్రీనివాస్ జిఎల్బి దర్శకుడు. కాయగూరల లక్ష్మీపతి నిర్మిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తిచేశారు. డబ్బింగ్ కూడా పూరికావడంతో రీ రికార్డింగ్ జరుపుతున్నారు. ఈ చిత్రం పాటలను ఇదేవారంలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు నిర్మాత తెలిపారు.
‘ఐక్యూ’ సినిమా చిత్రీకరణ హైదరాబాద్, అనంతపూర్‌లో జరిగింది. ఈ సినిమా టీజర్ ఫస్ట్‌లుక్, పోస్టర్ ఇప్పటికే విడుదల చేశారు. నవంబర్‌లో సినిమా విడుదల చేస్తామని” శ్రీనివాస్ జిఎల్బి ఈ సందర్భంగా తెలిపారు. ” సినిమా చూసిన యువతకు ప్రేరణ కలిగించే అంశాలు ఇందులో ఉన్నాయి ” అని చెప్పారు.
ఇతర పాత్రల్లో సుమన్, సత్యప్రకాష్, సూర్య, గీతాసింగ్, బెనర్జీ తదితరులు నటిస్తున్
నారు.
ఈ చిత్రానికి కథ, మాటలు, సంగీతం ఘటికాచలం, ఛాయాగ్రహణం టి.సురేంద్రరెడ్డి.
వైవిధ్యమైన ప్రేమకథతో ఔను నేనింతే!ప్రేమ కథల్లో కొత్తకోణాన్ని ఆవిష్కరిస్తూ శ్రీ సత్యవిధుర మూవీస్ ‘ఔను నేనింతే’! పేరుతో ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తోంది. కో డైరెక్టర్‌గా అనేక చిత్రాలకు పనిచేసి, వడ్డే నవీన్‌తో ‘ఆంటీ అంకుల్ నందగోపాల్’, సంపూర్ణేష్ బాబుతో ‘బజారు రౌడీ’ చిత్రాలకు దర్శకత్వం వహించిన డీవీకే.నాగేశ్వరరావు ఈ చిత్రానికి దర్శకుడు. ప్రేమకోసం ప్రాణాలర్పించే ప్రేమికులను ఇప్పటి వరకు చూశాం. దీనికి భిన్నమైన కోణంలో ఈ చిత్రం ఉంటుందని దర్శకుడు డీవీకే. నాగేశ్వరరావు తెలిపారు.
జి.విధుర చౌదరి, చిర నాగరాజ్ గౌడ్ నిర్మిస్తున్న ‘ఔను నేనింతే’ చిత్రం షూటింగ్ ఇదే నెల 26న హైదరాబాద్‌లో ప్రారంభిస్తారు.
‘ఔను నేనింతే’లో సంతోష్, సోనాక్షి హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇతర పాత్రల్లో తనికెళ్ల భరణి, పోసాని కృష్ణమురళి, షాయాజీ షిండే, బ్రహ్మానందం, పృథ్వీ, బాబ్జిd, గోరంట్ల బాబు, కాదంబరి కిరణ్, ఉత్తేజ్, రాజు, సన, మణిచందన, రజిత, హాసిని, లోరా, గౌతమి, అమ్ములు తదితరులు నటిస్తున్నారు. సంగీతం: కిషన్ కవాడియా, ఛాయాగ్రహణం: కల్యాణ్, ఫైట్స్: జాషువ, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: కృష్ణ. ఎం., కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: డీవీకే.నాగేశ్వరరావు.