సబీహా గౌసుద్దీన్
కూకట్పల్లి నియోజకవర్గం అల్లాపూర్ డివిజన్ పరిధిలోని వివేకానంద నగర్ వార్డు కార్యాలయంలో కార్పొరేటర్ సబీహా గౌసుద్దీన్ మరియు మేడ్చల్ జిల్లా మైనారిటీ సెల్ అధ్యక్షులు మహమ్మద్ గౌసుద్దీన్ డివిజన్ పరిధిలోని అన్ని బస్తీ మరియు కాలనీ అధ్యక్షులు, బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలతో, మహిళా కార్యకర్తలతో, సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో భాగంగా కార్పొరేటర్ మాట్లాడుతూ అల్లాపూర్ డివిజన్ పరిధిలో గతంలో దొంగతనాలు, మరియు లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్, చాలా ఉన్నందున ప్రజలకు ఏ సమస్య వచ్చినా డివిజన్ కు సంబంధించి పోలీస్ స్టేషన్ మూడు పరిధీలలో రావటంతో ప్రజలకు చాలా సమస్యలు తలెత్తయని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కి తెలియజేయడంతో ఎమ్మెల్యే సహాయ సహకారాలు ఆయన కృషి మేరకు మన డివిజన్ కి పోలీస్ స్టేషన్ తెచ్చుకోగలిగాం అని ఈ సందర్భంగా కార్పొరేటర్ డివిజన్ ప్రజలతో తెలియజేశారు. అలాగే పోలీస్ స్టేషన్ ప్రారంభోత్సవానికి అన్ని బస్తీ మరియు కాలనీ వాసులు, కార్యకర్తలు, ప్రజలందరు అధిక సంఖ్యలో పాల్గొని ఈ ప్రారంభోత్సవాన్ని విజయవంతం చేయాలని తెలియజేశారు.