SAKSHITHA NEWS

అమరావతి: ఇంటర్మీడియట్‌ పబ్లిక్‌ పరీక్షల ఫలితాలను ఈనెల 15లోపు విడుదల చేసేందుకు ఇంటర్మీడియట్‌ విద్యామండలి కసరత్తు చేస్తోంది. జవాబు పత్రాల మూల్యాంకనం, మార్కుల స్కానింగ్‌కు సంబంధించిన ప్రక్రియ ఆదివారంతో ముగిసింది. మూల్యాంకనాన్ని మరోసారి పునఃపరిశీలన చేసేందుకు వారంరోజులు సమయం పట్టనుంది. ఇంటర్మీడియట్‌ పరీక్షలు మార్చి 1 నుంచి 20వ తేదీ వరకు జరగగా.. ప్రథమ, ద్వితీయ సంవత్సరాల పరీక్షలకు రాష్ట్ర వ్యాప్తంగా 10లక్షలకుపైగా విద్యార్థులు హాజరయ్యారు…..