SAKSHITHA NEWS

Intermediate practical and theory tests should be conducted smoothly and efficiently.

ఇంటర్మీడియట్ ప్రాక్టికల్, థియరీ పరీక్షలు సాఫీగా, పగడ్బందీగా నిర్వహించాలి.

జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్
సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్:

ఫిబ్రవరి 15 నుండి ఏప్రిల్ 4 వరకు నిర్వహించనున్న ఇంటర్మీడియట్ ప్రాక్టికల్, థియరీ పరీక్షలు సాఫీగా, పగడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. ఐడిఓసి లోని కాన్ఫరెన్స్ హాల్లో ఇంటర్ మీడియట్ పరీక్షల ఏర్పాట్లపై అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, ఫిబ్రవరి 15 నుండి మార్చి 2 వరకు ప్రాక్టికల్ పరీక్షలు, మార్చి 4వ ఎథిక్స్ ఆండ్ హ్యుమన్ వ్యాల్యుస్, మార్చి 6న ఇన్విరాన్ మెంట్ పరీక్షలు, 15 మార్చి నుండి ఇతర సబ్జెక్టుల పరీక్షల నిర్వహణకు ఇంటర్మీడియట్ స్టేట్ బోర్డు, హైదరాబాద్ ఆదేశాలను జారిచేసిన క్రమంలో జిల్లాలో పరీక్షల నిర్వహణకు 63 పరీక్షా కేంద్రాలు ఏర్పాటుచేసినట్లు తెలిపారు.

ఇట్టి కేంద్రాల్లో 17,890 మంది మొదటి, 17,967 రెండవ సంవత్సరం మొత్తంగా 35,857 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నట్లు తెలిపారు.విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా పటిష్టమైన ఏర్పాట్లను చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ప్రాక్టికల్, థియరీ పరీక్షల ప్రశ్నపత్రాల భద్రపర్చుటకు పటిష్ట ఏర్పాటు చేయాలన్నారు. పరీక్షలు ముగిసే వరకు పరీక్షా కేంద్రాలకు నిరంతరాయంగా విద్యుత్ చేయాలని, పరీక్షల సమయంలో సమయానికి పరీక్ష కేంద్రాలకు విద్యార్థులు చేరుకునేలా ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయాలని కలెక్టర్ అన్నారు.

ద్రం దగ్గర్లో జిరాక్స్ సెంటర్లు మూసివేయించాలని, 144 సెక్షన్ అమలు చేయాలని ఆయన అన్నారు. కేంద్రం లోపల, పరిసరాల్లో పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలన్నారు. పరీక్షలు ఎలాంటి లోటుపాట్లు లేకుండా సజావుగా జరిగేలా అన్ని చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అన్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ ఎన్. మధుసూదన్, జిల్లా రెవిన్యూ అధికారిణి ఆర్. శిరీష, జెడ్పి సిఇఓ వివి. అప్పారావు, జిల్లా ఇంటర్ మీడియట్ అధికారి రవిబాబు, ఎస్బి ఏసిపి డి. ప్రసన్నకుమార్, జిల్లా విద్యాశాఖాధికారి ఇ. సోమశేఖరశర్మ, జిల్లా వైద్యాధికారి డా. బి. మాలతి, ఆర్సీవోలు జ్యోతి, ప్రత్యుష, అధికారులు తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS