SAKSHITHA NEWS

Interfering with the lives of farmers in the name of Dharani Portal

ధరణి పోర్టల్ పేరుతో రైతుల జీవితాలతో చెలగాటం

షాద్ నగర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ “వీర్లపల్లి శంకర్”

ధరణి పోర్టల్‌ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్

చలో కలెక్టరేట్ కు షాద్ నగర్ కాంగ్రెస్

రంగా రెడ్డి జిల్లా సాక్షిత ప్రతినిధి

షాద్ నగర్, రాష్ట్ర ప్రభుత్వం ధరణి పోర్టల్ పేరుతో రైతుల జీవితాలతో ఆడుకుంటోందని షాద్ నగర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ “వీర్లపల్లి శంకర్” విమర్శలు గుప్పించారు. రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ ముందు కాంగ్రెస్ చేపట్టిన నిరసన దీక్షలో భట్టి పాల్గొని వీర్లపల్లి శంకర్ ప్రసంగించారు.


సోమవారం జిల్లా పార్టీ అధ్యక్షుడు చల్ల నరసింహారెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు నియోజకవర్గంలోని ఆరు మండలాల నుండి పెద్ద ఎత్తున కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయానికి తరలి వెళ్లారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటుచేసిన ఆందోళనలో “వీర్లపల్లి శంకర్” మాట్లాడుతూ.. ధరణి పోర్టల్ ను వెంటనేరద్దు చేయాలని…సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

భూమిలేని నిరుపేదలకు భూపంపిణీ చేయాలన్నారు. పోడు రైతుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేయాలని సూచించారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రైతాంగ సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామని ఆయన హామీ ఇచ్చారు. టిఆర్ఎస్ పాలనలో అందరూ భూ బకాసురులు ఉన్నారని విమర్శించారు.

చలో కలెక్టరేట్ షాద్న నగర్ నియోజకవర్గం నుండి వీర్లపల్లి శంకర్ ఆధ్వర్యంలో చలో కలెక్టరేట్ కు బయలుదేరిన కాంగ్రెస్ నాయకులు టిఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ధరణి ఫోటోలు రద్దు చేయాలని గత ఎలక్షన్లలో ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని రైతు రుణమాఫీ ఏకకాలంలో చేయాలని,

కొంగర కలాన్ నూతన కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించిన వారిలో రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు చల్ల నరసింహారెడ్డి పాల్గొన్నారు. ధర్నా అనంతరం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అధికారులకు వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో షాద్ నగర్ ఆరు మండలాల అధ్యక్షులు బ్లాక్ కాంగ్రెస్ కిసాన్ కాంగ్రెస్, మహిళా కాంగ్రెస్ సర్పంచులు ఎంపీటీసీలు కాంగ్రెస్ అనుబంధ సంఘాలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు..


SAKSHITHA NEWS