Integrated market construction works were inspected by: Pura Chairman Edma Satyam
ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణం పనులు పరిశీలించిన : పుర చైర్మన్ ఎడ్మ సత్యం
సాక్షిత : కల్వకుర్తి పట్టణ పరిధిలో మార్కెట్ యార్డ్ యందు నూతనంగా నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణం పనులను బుధవారం పుర చైర్మన్ ఎడ్మ సత్యం పరిశీలించారు,
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భవిష్యత్ తరాలకు ఉపయోగపడేవిధంగా నూతన హంగు హర్బటాలతో నిర్మాణం అవుతున్న ఇంటిగ్రేటెడ్ (సమీకృత) మార్కెట్ నిర్మాణం జరుగుతుందని తెలిపారు అలాగే నిర్మాణం పనులను నాణ్యతగా త్వరగా పూర్తి చేయాలని డీఈ, మునిసిపల్ ఏఈ మరియు కాంట్రాక్టర్లకు సూచించడం జరిగింది
ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ బాలు నాయక్, డీఈ శ్రీనివాస్, ఏఈ శివ కృష్ణ, క్రాంతి కుమార్ పుర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.