124 డివిజన్ పరిధిలోని ఇండియన్ బ్యాంక్ నుండి ఎల్లమ్మ చెరువు సర్ ప్లస్ నాలా వద్దకు రెండు కోట్ల రూపాయల నిధులతో జరుగుతున్న భూగర్భ పైప్ లైన్ నిర్మాణ పనులను డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ ఉషముళ్ళపూడి ప్రధాన రహదారిలోని శుభోదయ కాలనీ పరిసర ప్రాంతాలలో రోడ్డు మీద నిలిచిపోతున్న వరద నీరుని ప్రస్తుతం నిర్మిస్తున్న పైప్ లైన్ల ద్వారా నేరుగా ఎల్లమ్మచెరువు సర్ ప్లస్ నాలలో కలిసేటట్లుగా ఏర్పాటుచేసి పైప్ లైన్ నిర్మాణం జరుగుతుందని అన్నారు. చిన్న వర్షానికి కూడా గతంలో చాలాసార్లు ఇండియన్ బ్యాంక్ వద్ద నీరు నిలిచిపోయి పక్కన ఉన్న ఇండ్లలోకి, అపార్టుమెంట్ సెల్లార్ లలోకి నీరు చేరి ప్రజలు చాలా ఇబ్బంది పడేవారని గుర్తు చేశారు. ఇప్పుడు ఈ భూగర్భ పైప్ లైన్ నిర్మాణంతో వరద నీటి సమస్య తొలగిపోతుంది అని అన్నారు. ఈ కార్యక్రమంలో సమ్మారెడ్డి, శివరాజ్ గౌడ్, షౌకత్ అలీ మున్నా, పోశెట్టిగౌడ్, నజీర్, మోజెస్, వర్క్ ఇస్పెక్టర్ రవి కుమార్ తదితరులు పాల్గొన్నారు.
ఎల్లమ్మచెరువు వద్ద పైప్ లైన్ నిర్మాణ పనులను పరిశీలించిన
Related Posts
మహబూబాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మురళి నాయక్
SAKSHITHA NEWS మహబూబాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మురళి నాయక్ క్యాంపు కార్యాలయంలో ప్రైస్ మీట్.. ప్రభుత్వ విఫ్ డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్,రామచంద్రు నాయక్ కామెంట్స్… రేపు మహబూబాబాద్ వస్తున్న మాజీ మంత్రి కేటీఆర్ పర్యటను అడ్డుకొని తీరుతాం. .. మెడికల్ కళాశాలకు…
వికలాంగుల హక్కుల పోరాట సమితి నిర్వహిస్తున్న ధర్నాకు సంఘీభావం
SAKSHITHA NEWS వికలాంగుల హక్కుల పోరాట సమితి నిర్వహిస్తున్న ధర్నాకు సంఘీభావం తెలిపిన మందకృష్ణ మాదిగ ఖమ్మం : కలెక్టర్ కార్యాలయం ముందు వికలాంగుల హక్కుల పోరాట సమితి చేస్తున్న ధర్నాకు సంఘీభావం మందకృష్ణ మాదిగ తెలిపారు . ఈ సందర్భంగా…