జగనన్న కాలనీలో మౌలిక వసతులు కల్పించాలి..!
●అర్హులైన పేదలకు ఇళ్ల పట్టాలు, పొజిషన్ సర్టిఫికెట్లు ఇవ్వాలి..!
●”గడపగడపకు మన ప్రభుత్వం” లో వచ్చే అర్జీల కు ప్రాధాన్యత ఇవ్వాలి..!
●అధికారులకు రాప్తాడు ఎమ్మెల్యే #తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఆదేశం..
ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పేద, బడుగు, బలహీన వర్గాల కోసం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న జగనన్న కాలనీలో మౌలిక సదుపాయాలు కల్పించేలా చర్యలు తీసుకోవాలని రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఆదేశించారు. అనంతపురంలోని డ్వామా హల్ లో హౌసింగ్, రెవిన్యూ శాఖల అధికారులతో ఎమ్మెల్యే సమీక్షించారు. ఇళ్ల నిర్మాణాల విషయమై గ్రామాల వారీగా పురోగతిని అడిగి తెలుసుకున్నారు. సొంతంగా స్థలం ఉండి ఇంటి నిర్మాణాలకు వచ్చిన దరఖాస్తులను ఆరా తీశారు. జగనన్న కాలనీలకు రోడ్డు సదుపాయం కల్పించాలన్నారు. అర్హులైన పేదలకు ఇళ్ల పట్టాలు పొజిషన్ సర్టిఫికెట్లు మంజూరు చేయాలని రెవెన్యూ అధికారులకు సూచించారు. “గడపగడపకు మన ప్రభుత్వం” కార్యక్రమానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ఈ కార్యక్రమం సందర్భంగా ప్రజల నుంచి వచ్చే ఆర్జీల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ఈ సమావేశంలో ఆర్డీవో మధుసూదన్, పంచాయతీరాజ్ ఎస్సీ భాగ్యరాజ్, హౌసింగ్ పీడీ కేశవ నాయుడు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, మండల కన్వీనర్లు, డిఈలు, ఏఈలు, అనంతపురం రూరల్, రాప్తాడు, ఆత్మకూరు మండలాల తహసిల్దార్లు, వీఆర్వోలు, సర్వేయర్లు పాల్గోన్నారు.