ప్రకాశం జిల్లా….
భారతదేశం గర్వించదగ్గ దళిత నాయకుడు డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్…
Mrps అధ్వర్యంలో ఘనంగా డా.బాబు జగ్జీవన్ రామ్ 116 వ జయంతి…
ఆ మహనీయుని చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు….
దళిత బాంధవుడు అణగారిన వర్గాల ఆశాదీపం అయినటువంటి బాబు జగజీవన్ వర్ధంతి కార్యక్రమాన్ని మార్కాపురం పట్టణంలోని స్థానిక ప్రెస్ క్లబ్ నందు ఎంఆర్పిఎస్ మరియు ఎం.ఇ. ఎఫ్, ఎం.ఎస్.ఎఫ్, ఎం.ఎస్. పి,అనుబంధ సంఘాల, ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షులు అదిములపు ప్రకాష్ మరియు ఎంఈఎఫ్,నాయకులు సంజీవయ్య, కుమార్, ఎంఎస్పి, పందిటి కాశీ రావు మాదిగ,లు మాట్లాడుతూ శ్రీ బాబూ జగ్జీవన్ రామ్ దేశ స్వాతంత్య్రం,సామాజిక సమానత్వం కోసం అలుపెరుగని పోరాటం చేసిన ఆదర్శనేతని, ప్రజాస్వామ్య భారతదేశంలో ఆయన మంత్రిగా సుదీర్ఘ కాలం సేవలు అందించటమే కాకుండా ఉప ప్రధానిగా కూడా వ్యవహరించారన్నారు.
అట్టడుగు వర్గాల అభున్నతికి, అణగారిన వర్గాలకు సమాన హక్కుల కోసం ఎనలేని పోరాటం చేశారని, భారత రాజ్యాంగంలో సామాజిక న్యాయం అనే అంశాన్ని పొందుపరచడంలో ప్రముఖ పాత్ర పోషించారని, మంచి ప్రజానాయకుడిగా, రాజనీతిజ్ఞుడిగా, పరిపాలనాదక్షుడిగా ప్రజలచేత ఆప్యాయంగా “బాబూజీ” అని పిలిపించుకున్నారని, అలాంటి మహనీయుని ఆదర్శాలను పాటిస్తూ సమసమాజ స్థాపనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని వారు పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో ఆమ్ ఆద్మీ జిల్లా కన్వీనర్ వేసపోగు సుదర్శన్ రావు, సర్పంచ్ గుడ్డే పోగు రమేష్, సీనియర్ నాయకులు జడ్డ నాగయ్య, మున్నంగి లాజర్, ఆశీర్వాదం, సింగపోగు పోలయ్య, రాజు, సురేష్, రాజ్ కమల్,ఎమ్మార్పీఎస్, ఎంఈఎఫ్, ఎంఎస్పి, ఎమ్మెస్ ఎఫ్, పాల్గొని బాబు జగజ్జివన్ చిత్రపటానికి ఘన నివాళులర్పించారు.