SAKSHITHA NEWS

స్వతంత్ర భారత వజ్రోత్సవ ద్వి సప్తాహ వేడుకలలో భాగంగా ‘ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అదేశాల మేరకు కొండాపూర్ డివిజన్ పరిధిలోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి లో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంను జోనల్ కమిషనర్ శంకరయ్య డీసీ వెంకన్న డిప్యూటీ DMHO శ్రీమతి సృజన ఆసుపత్రి సూపర్డెంట్ వరద చారి కార్పోరేటర్ హామీద్ పటేల్ తో కలిసి ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభించిన ప్రభుత్వ విప్ శ్రీ ఆరెకపూడి గాంధీ .

ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ మాట్లాడుతూ ‘స్వతంత్ర భారత వజ్రోత్సవ ద్వి సప్తాహ వేడుకలలో భాగంగా ‘ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అదేశాల మేరకు మహా రక్త దానం శిబిరం నిర్వహించడం చాలా సంతోషకరమైన విషయం అని ,స్వచ్ఛంధంగా ముందుకు వచ్చి రక్తదానం చేయడం చాలా సంతోషకరమైన విషయం అని, మంచి స్పందన వచ్చినది అని ,అన్ని దానంల కన్నా రక్తదానం గొప్పది అని, ప్రతి ఒక్కరు సామాజిక బాధ్యత గా తప్పనిసరిగా రక్తదానం చేయాలని, నిండు ప్రాణాలను కాపాడినవారు అవుతారు అని ప్రభుత్వ విప్ గాంధీ పేర్కొన్నారు. రక్తదానం చేసి ఆపదలో ఉన్న వారి ఇతర ప్రాణాలు కాపాడిన దైవ సమానులు అవుతారు అని కావున ప్రతి ఒక్కరు స్వచ్ఛంద గా ముందుకు వచ్చి రక్తదానం చేయాలని ప్రభుత్వ విప్ గాంధీ పేర్కొన్నారు. అదేవిధంగా
ఎందరో మహనీయుల త్యాగాల ద్వారా సాధించుకున్న స్వతంత్ర భారతాన్ని సగర్వంగా నిలుపుకోవడం ప్రతి భారతీయుని కర్తవ్యం అని ప్రభుత్వ విప్ గాంధీ అన్నారు. మనం నేడు అనుభవిస్తున్న స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు ఎంతటి విలువైనవో నేటి యువత తెలుసుకోవాల్సిన అవసరమున్నదన్నారు.
స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏండ్లు గడిచిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకల సందర్భంగా నాటి అమరుల త్యాగాలను పదిహేనురోజుల పాటు వివిధ కార్యక్రమాల ద్వారా నివాళులర్పిస్తూ స్మరించుకోవాలని ప్రభుత్వ విప్ గాంధీ పేర్కొన్నారు.
ఎందరో మహానుభావుల త్యాగపలం స్వతంత్ర భారతం అని , మహానియులను స్మరించుకోవడం మన విధి అని, ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన సూచనల మేరకు స్వతంత్ర భారతానికి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఆగస్ట్ 15 న స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను అంగరంగ వైభవంగా జరుపుకున్నాం అని అదేవిధంగా ప్రతి ఇంటిపైన త్రివర్ణ పతాకం ఎగురవేసి సంబరాలను అంగరంగ వైభవంగా జరుపుకున్నాం అని ప్రభుత్వ విప్ గాంధీ పేర్కొన్నారు. అదేవిధంగా
ఇంటి ఇంటింటా జాతీయ పతాకాన్ని ఎగురావేసి, స్వతంత్ర భారత కీర్తిని నలుదిశలా చాటాలని, అన్నారు. స్వతంత్ర పోరాట యోధులను స్మరిస్తూ, వారి స్ఫూర్తిని ముందుకు తీసుకోని వెళ్లాలని కోరారు. సంక్షేమం, అభివృద్ధి దిశగా మన భారత దేశం అడుగులు వెయ్యటంలో ప్రతి భారతీయుని పాత్ర ఉండాలని అన్నారు. ఏ దేశమేగిన, ఎందు కాలిడిన పొగడరా నీ తల్లి భూమి భారతిని అనే విషయాన్నీ ప్రతి ఒక్కరూ గుర్తు పెట్టుకొని భారతదేశ ఖ్యాతిని పెంచాలని కోరారు. సర్వమత సమ్మేళనంగా ముందుకు భారతీయులు కదిలి, దేశ అభివృద్ధికి తోడ్పాడాలని ప్రభుత్వ విప్ గాంధీ కోరారు.

ఈ కార్యక్రమంలో

AMOH నగేష్ నాయక్, AMOH కార్తిక్, అర్ ఎంవో విజయకుమారి, బ్లడ్ బ్యాంకు మెడికల్ ఆఫీసర్ డా. వేరొనిక , పాతోలోజిస్ట్ డా. మాలతీ, డిప్యూటీ పారా మెడికల్ ఆఫీసర్ అర్ రవీందర్ రెడ్డి, హెల్త్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ బాలరామ్, సబ్ యూనిట్ ఆఫీసర్ పి. శ్రీనివాస్, పిహెచ్ సీ సిహెచ్ వో స్వామి, ఆసుపత్రి సిబ్బంది, మరియు గ్రంథాలయ డైరెక్టర్ గణేష్ ముదిరాజు, మాజీ కార్పోరేటర్ రవీందర్ ముదిరాజు, కొండాపూర్ డివిజన్ అధ్యక్షులు కృష్ణ గౌడ్, మాదాపూర్ డివిజన్ అధ్యక్షులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, తెరాస నాయకులు ఉట్ల కృష్ణ ,రమేష్ పటేల్,జంగం గౌడ్, చాంద్ పాషా, బలరాం యాదవ్,తిరుపతి యాదవ్ , చింతకింది రవీందర్, వేణు గోపాల్ రెడ్డి, రమేష్, గణపతి, నరేష్, రవి శంకర్, వెంకటి, టీ కృష్ణ, సిద్దిఖ్ నగర్ బస్తీ ప్రెసిడెంట్ బసవ రాజు, సాగర్ చౌదరి ఆనంద్ చౌదరి, కుమార్, రూప రెడ్డి,తెరాస నాయకులు, కార్యకర్తలు, మహిళ నాయకులు,శ్రేయభిలాషులు తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS