జగతగిరిగుట్ట పోలీసుస్టేషన్ పరిధిలోని అనేక కాలనీలో నిర్మానుష్యంగా ఉన్న ప్రాంతాల్లో,అక్రమంగా నడుస్తున్న బెల్ట్ షాపుల వద్ద ప్రజలు ముక్యంగా యువకులు మందు,గంజాయి సేవిస్తున్నారని,ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని కావున పోలీస్ బందోబస్తును పెంచి,క్రమం తప్పకుండా నిఘా పెంచి శాంతి భద్రతలు కాపాడాలని లేకపోతే 2 రోజుల క్రితం జరిగినట్లు జరిగితే ప్రజలకు తీవ్రనష్టం కలుగుతుందని నేడు సీపీఐ ఆధ్వర్యంలో జగతగిరిగుట్ట పోలీస్ స్టేషన్లో సబ్ ఇన్స్పెక్టర్ శంకర్ కి వినతిపత్రం ఇవ్వడం జరిగింది.
ఈ కార్యక్రమంలో సిపిఐ సహాయ కార్యదర్శి దుర్గయ్య, కోశాధికారి సదానంద్,శాఖ కార్యదర్శి సహదేవ్,కార్యవర్గ సభ్యులు రాములు,వెంకటేష్, శ్రీనివాస్,స్థానిక నాయకులు ఖయుమ్,ఇమామ్,భాస్కర్,మహబూబ్, ప్రభాకర్,ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు.