SAKSHITHA NEWS

Increase in quality standards with farmers’ care

రైతుల జాగ్రత్తలతో నాణ్యత ప్రమాణాల పెరుగుదల

రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం..

తెలంగాణ రాష్ట్రం లో పత్తికి దేశంలోనే మంచి డిమాండ్

సాక్షిత : మంచిర్యాల జిల్లా లోని దండేపల్లి మండలం కన్నెపల్లి గ్రామంలో సోమవారం కాటన్ జిన్నింగ్ మిల్ ను ప్రారంభించిన సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ , యం.పి బోర్లకుంట వెంకటేష్ నేత , ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు, డిసిఎంఎస్ ఛైర్మన్ లు తిప్పని లింగయ్య ఛైర్మన్ ఎల్లాల శ్రీకాంత్ రెడ్డి ,

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..

మన దేశంలో పత్తి ధర మిగతా దేశాలతో పోలిస్తే ఎక్కువగా ఉందని రైతులు కొద్ది పాటి జాగ్రత్తలు తీసుకుంటే నాణ్యత ప్రమాణాలు కలిగిన పత్తి దిగుబడి వస్తుందని సీసిఐ కూడా ఇబ్బందులు లేకుండా పత్తి కోనుగోలు చేయడం జరుగుతుందని అన్నారు. కాగా ప్రస్తుత ప్రభుత్వం పత్తి ధర క్వింటాకు రూ.6380, నిర్ణయించిందన్నారు

దేశంలోనే తెలంగాణ రాష్ట్రం పత్తికి మంచి పేరు ఉందని సాక్షాత్తు ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ప్రస్తావించారని మంత్రి తెలిపారు..

తెలంగాణ ప్రభుత్వం రైతుల కోసం రైతుబంధు, రైతు బీమా, 24 గంటల కరెంటు లాంటి పథకాలను ప్రవేశ పెట్టిందన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం చిత్తశుద్ధితో పనిచేస్తుందని రైతులు పండించిన ప్రతి పంటకు గిట్టుబాటు ధర కల్పించి ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని అన్నారు.


SAKSHITHA NEWS