SAKSHITHA NEWS

ఉద్యమకారుల సంక్షేమ సంఘం కార్యాలయం ప్రారంభోత్సవం

సాక్షిత సూర్యాపేట జిల్లా ప్రతినిధి : శుక్రవారం తెలంగాణ మలిదశ ఉద్యమకారుల సంక్షేమ సంఘం కార్యాలయం సూర్యాపేట పాత బస్టాండ్ వద్ద ప్రారంభించడం జరిగింది. తెలంగాణ ఉద్యమకారుడు టీజేఎస్ రాష్ట్ర కార్యదర్శి ధర్మార్జున్ చేతులమీదుగా కార్యాలయాన్ని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ సంఘం అధ్యక్షులు సామ అంజిరెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమం కోసం ఈ సంఘాన్ని ఏర్పాటు చేయడం జరిగింది

ప్రత్యేక తెలంగాణ ఏర్పాటుకోసం పోరాటం చేసిన ఉద్యమకారులందరికీ 250 గజాల ఇంటి స్థలము, ఇంటి నిర్మాణానికి కావలసిన ఆర్థిక మొత్తాన్ని అలాగే ఉద్యమకారులకు సరైన గుర్తింపు తో 25వేల రూపాయలు పెన్షన్, హెల్త్ కార్డు ఇచ్చి స్వతంత్ర సమరయోధులుగా వారిని గుర్తించి వారిని గౌరవించాలని ప్రభుత్వాన్ని కోరారు. ప్రభుత్వం కూడా మేనిఫెస్టోలో ఇట్టి విషయాలు పెట్టారు. కనుక వెంటనే ఉద్యమకారులకు ఇస్తానన్నటువంటి ఇంటి స్థలము పెన్షన్ వెంటనే ఇవ్వాల్సిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో సంఘం ప్రధాన కార్యదర్శి లింగయ్య, ఉపాధ్యక్షులు కోడి సైదులు,కోతి మధుసూదన్ రెడ్డి, కోతి మాధవి, కుసుమ సిద్ధారెడ్డి,బొప్పిడి లక్ష్మీనారాయణ,వీరబాబు తదితరులు హాజరయ్యారు.


SAKSHITHA NEWS