రమజాన్ ఉపవాసాల పరమార్ధమేమిటి? సహెరీ, ఇఫ్తార్ శుభాల సంగతులు, రమజాన్ మనలో ఎలాంటి మార్పు కోరుతుంది తదితర విశేషాల సమాహారంతో గీటురాయి వారపత్రిక ముద్రించిన రమజాన్ ప్రత్యక సంచికను జమాఅతె ఇస్లామీ హింద్ తెలంగాణ లీగల్ అఫైర్స్ కార్యదర్శి ముహమ్మద్ ఇల్యాస్, జిల్లా అధ్యక్షులు జైనుల్ పాషా, ఉపాధ్యక్షులు అబ్దుల్ సమి, ఖిల్లా డివిజన్ అధ్యక్షులు అబ్దుల్ మలిక్, మాజీ అధ్యక్షులు ఖలీల్ అహ్మద్ ఖాన్ ఆవిష్కరించారు.
ఖమ్మం పట్టణంలో అజీజ్ సందులో గల జమాఅతె ఇస్లామీ హింద్ కార్యాలయంలో ఖిల్లా శాఖ ఆధ్వర్యంలో జరిగిన రమజాన్ ప్రత్యక సంచిక ఆవిష్కరణ అనంతరం ముహమ్మద్ ఇల్యాస్ మాట్లాడుతూ రమజాన్ ఉపవాసాలు మనిషిలో ఎలాంటి మార్పు తీసుకొస్తాయో ఇందులోని వ్యాసాలు చక్కటి స్ఫూర్తినింపుతాయని ఆయన అన్నారు. రోజాలు, తరావీహ్ నమాజులు, ఖుర్ఆన్ పారాయణం చేస్తూ రమజాన్ నెల రోజులను ముస్లిములు సద్వినియోగం చేసుకోవాలని ఆయన ముస్లిములకు పిలుపునిచ్చారు. జిల్లా అధ్యక్షులు జైనుల్ పాషా మాట్లాడుతూ జకాత్ పేదల హక్కు అని స్థితిమంతులు తమ సంపదలోనుంచి జకాత్ దానాన్ని నిరుపేదలకు పంచాలని ఆయన కోరారు. ఇస్లామ్ పట్ల అపోహలు, అపార్థాలను తొలగించి నాలుగు దశాబ్దాలుగా గీటురాయి పత్రిక భిన్న వర్గాలకు వారధిగా నిలుస్తోందని ఆయన అన్నారు. ఈ పత్రికను ప్రజల్లోకి తీసుకెళ్లి రమజాన్ విశిష్టత గురించి తెలియజేయాలని ఆయన చెప్పారు. పవిత్ర రమజాన్ నెల విశిష్టతపై రచయితలు చేసిన విశ్లేషణలు చక్కని అవగాహన కల్పిస్తాయని అన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app
SAKSHITHA NEWS
DOWNLOAD APP