ప్రారంభించిన మంత్రి విడుదల రజనీ , శాసనసభ్యులు కృష్ణప్రసాదు .
మైలవరంలో రూ.3కోట్లతో సామాజిక ఆరోగ్య కేంద్రం ఆధునికీకరణ
సాక్షిత ఎన్టీఆర్ జిల్లా, మైలవరం :
మైలవరంలో రూ.3కోట్ల వ్యయంతో ఎంతో ప్రతిష్టాత్మకంగా ఆధునికరించి నిర్మించిన సామాజిక ఆరోగ్య కేంద్ర భవన సముదాయాన్ని ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి శ్రీమతి విడుదల రజనీ , మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాదు ప్రారంభించారు. 50 పడకల ఆసుపత్రిలోని వివిధ విభాగాలను పరిశీలించారు. ఇక్కడ కిడ్నీ సంబంధిత వ్యాధులు చికిత్సలకు డయాలసిస్ కేంద్రం ఏర్పాటు చేయాలని మంత్రి రజనీ కి శాసనసభ్యులు కృష్ణప్రసాదు విజ్ఞప్తి చేయగా ఆమె సూత్రప్రాయంగా అంగీకరించారు.
శాసనసభ్యులు కృష్ణప్రసాదు మాట్లాడుతూ పేదల కోసం ఆరోగ్య శ్రీ పథకాన్ని రూపొందించి అమలు చేసిన రాజన్న బిడ్డ మన సీఎం జగనన్న పేదల ఆరోగ్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తూ ఆసుపత్రులను అభివృద్ధి చేస్తున్నారని పేర్కొన్నారు. ఆసుపత్రికి నిధులు మంజూరు చేసిన మంత్రి విడుదల రజనీ కి కృతజ్ఞతలు తెలిపారు. జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు , వైద్య విధాన పరిషత్ కమిషనర్ వెంకటేశ్వరరావు పాల్గొని ప్రసంగించారు. ముందుగా దివంగత మహానేత రాజశేఖర్ రెడ్డి ప్రతిమకు పూలమాలలు వేసి ఘననివాళులర్పించారు. స్థానిక ప్రజాప్రతినిధులు, వైసీపీ నాయకులు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.