SAKSHITHA NEWS

Inauguration of Aahar Food Planet Hotelto the programArekapudi Gandhi

124 డివిజన్ పరిధిలోని ఎల్లమ్మబండ మెయిన్ రోడ్డులో నూతనంగా ఏర్పాటుచేసిన ఆహార్ ఫుడ్ ప్లానెట్ హోటల్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి శేరిలింగంపల్లి శాసనసభ్యులు ప్రభుత్వ విప్ ఆరేకపూడి గాంధీ కార్పొరేటర్లు నార్నే శ్రీనివాసరావు, ఉప్పలపాటి శ్రీకాంత్ మరియు యువనేత దొడ్ల రామకృష్ణ గౌడ్ తో కలిసి ముఖ్యఅతిధిగా హాజరై రిబ్బన్ కట్ చేసి ప్రారంభించడం జరిగింది.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ యాజమాన్యం వారి కుటుంబానికి మంచి పేరు మరియు లాభాలు వచ్చి వ్యాపారం అభివృద్ధి అవ్వాలని కోరుకుంటున్న అన్నారు.

ప్రజలకు నాణ్యతతో కూడిన రుచికరమైన టిఫిన్స్ మరియు భోజనం అందించాలని సూచించారు. కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు అనిల్ రెడ్డి, ఉపాధ్యక్షులు చిన్నోళ్ల శ్రీనివాస్ మరియు కాశినాథ్ యాదవ్, రాములుగౌడ్, కైసర్, జీవన్ రెడ్డి, వెంకటేష్, హరీష్, మారుతి, కూర్మయ్య, మరియు హోటల్ నిర్వహికులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS