SAKSHITHA NEWS

సచివాలయంలో అభయహస్తం గ్యారంటీల ప్రారంభ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పీచ్ స్క్రోలింగ్ పాయింట్స్….

పేదల ఇంట్లో వెలుగులు నింపేందుకు సోనియాగాంధీ ఆరు గ్యారంటీలను తెలంగాణ ప్రజలకు అంకితమిచ్చారు.

సోనియాగాంధీపై విశ్వాసంతో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు అధికారం కట్టబెట్టారు.

నిజమైన లబ్ధిదారులకు, అర్హులకు పథకాలను అందించడమే ప్రజా పాలన ఉద్దేశం.

అందులో భాగంగా ఇవాళ 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రూ.500లకే గ్యాస్ సిలిండర్ పథకాలు ప్రారంభించుకుంటున్నాం.

ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కారణంగా పథకాలను సచివాలయంలో లాంఛనంగా ప్రారంభించుకుంటున్నాం.

మహిళల కళ్లలో ఆనందం చూడాలనే రూ.500 గ్యాస్ సిలిండర్ పథకాన్ని ప్రారంభిస్తున్నాం.

పేదలకు పథకాలు చేరేలా అధికారులు విధి విధానాలు రూపొందించారు.

ఆర్ధిక నియంత్రణ పాటిస్తూ పేదలకు ఇబ్బంది కలగకుండా పథకాలు అమలు చేస్తున్నాం..

హామీలు అమలు చేయడంలో మా ప్రభుత్వం నిబద్ధతతో ఉంది.

తండ్రీ కొడుకులు, మామా అల్లుళ్లు తప్పుడు ప్రచారం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.

సోనియమ్మ మాట ఇచ్చారంటే అది శిలాశాసనం..

సోనియా గాంధీ ప్రజలకు ఇచ్చిన ప్రతీ హామీని నెరవేరుస్తాం..

WhatsApp Image 2024 02 27 at 4.31.21 PM

SAKSHITHA NEWS