వర్షాకాలం దృష్ట్యా పట్టణ పట్టణ ప్రజలు పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి మున్సిపల్ చైర్ పర్సన్ శ్రీమతి దాసరి మమతా రెడ్డి
ఉదయం 5 గంటల శానిటేషన్ హాజరు సమయంలో చైర్ పర్సన్ హాజరై మున్సిపల్ సిబ్బందితో వారి బాగోగులు తెలుసుకొని వర్షాకాలం దృశ్య పెద్దపల్లి పట్టణంలో శానిటేషన్ పనులు సక్రమంగా నిర్వహించాలని అన్నారు తదనంతరం మున్సిపల్ కమిషనర్ తో కలిసి స్థానిక కూరగాయల మార్కెట్ పరిశీలించి కూరగాయల వ్యాపారులకు వర్షాకాలం సందర్భంగా కూరగాయల పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు అదేవిధంగా పలు వార్డుల్లో తిరుగుతూ శానిటేషన్ పై తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు సూచనలు చేశారు.
ఈకార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ మట్ట శ్రీనివాస్ రెడ్డి ,కౌన్సిలర్ షాహీధ సబీర్ ఖాన్ , ఏఈ సతీష్,మనోహర్ వర్క్ ఇన్స్పెక్టర్ అనిల్,సానిటరీ ఇన్స్పెక్టర్లు రామ్మోహన్ రెడ్డి,పులిపాక రాజు,సదానందం, శంకర్ ముదిరాజ్ సంఘం అధ్యక్షులు కొలిపాక నర్సయ్య ,షమీమ్ తదితరులు పాల్గొన్నారు.