సాక్షిత : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనలో అర్హతే ప్రామాణికంగా సంక్షేమం ప్రతి ఇంటి తలుపుతడుతోందని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, యువజన సరీ్వసుల, క్రీడాశాఖ మంత్రి ఆర్కే రోజా అన్నారు. నగరి నగరి మున్సిపాలిటీ పద్మావతి నగర్ సచివాలయం పరిధిలోని 26వ, 25వ వార్డు వీధులలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఇంటింటికీ వెళ్లి మూడున్నర ఏళ్ల కాలంలో సంక్షేమం, అభివృద్ధి ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు చేస్తున్న మేలును అంకెలతో సహా వివరించారు.
నవరత్న పథకాల ద్వారా ఆయా కుటుంబాలకు ఏయే సంక్షేమ పథకాలు అందాయి, వాటి ద్వారా ఎంత మేర లబ్ధి చేకూరిందో వివరించారు. ఇంకా ఏవైనా సమస్యలు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. సంక్షేమ పథకాల బుక్లెట్లను అందజేశారు. సమస్యల కారణంగా పథకాల లబ్ధి ఆగిందని పలువురు మంత్రి దృష్టికి తీసుకురాగా, ఎందుకు ఆగిందో సచివాలయ సిబ్బంది, వలంటీర్ల ద్వారా తెలుసుకున్నారు. వాటి పరిష్కార మార్గాలను సూచిస్తూ అర్హులెవ్వరికీ అన్యా యం జరగకూడదని సచివాలయ సిబ్బందికి సూచించారు.
ఈ కార్యక్రమంలో నగరి మున్సిపాలిటీ చైర్మన్ వైస్ చైర్మన్లు కౌన్సిలర్లు అధికారులు సచివాలయ సిబ్బంది లు తదితరులు పాల్గొన్నారు.
[