SAKSHITHA NEWS

పశ్చిమగోదావరి జిల్లా సముద్ర తీర ప్రాంతంలో తాబేళ్ల రక్షణకు ప్రత్యేక చర్యలు…

అటవీ శాఖ ఆధ్వర్యంలో తాబేళ్ల గుడ్లు సంరక్షణకు ప్రత్యేక హెచ్చరిస్ ఏర్పాటు..

గత నెల రోజులుగా 41 ఆలీవ్ రెడ్ల్లీ సముద్ర తాబేళ్ళు పెట్టిన సుమారు 4,440 గుడ్లు హెచ్చరిస్ ఏర్పాటుతో సంరక్షణ..

రానున్న రెండు నెలల్లో మరో 25 వేలు గుడ్లు పెట్టే అవకాశం…

సముద్ర తీర ప్రాంత సంరక్షణకు మడ అడవుల పెంపకానికి అత్యంత ప్రాధాన్యత నివ్వాలి..

… జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి

సముద్ర పర్యావరణ సమతుల్యతను పరిరక్షించేందుకు తాబేళ్ల సంరక్షణకు ప్రత్యేక పరిరక్షణ చర్యలు చేపట్టినట్లు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు.

మంగళవారం నరసాపురం మండలం సముద్ర తీర ప్రాంతం చినమైనవానిలంక గ్రామంలో తాబేళ్లగుడ్లు సంరక్షణకు అటవీ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన గుడ్ల సేకరణ – సంరక్షణ – పునరుత్పత్తి కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, జిల్లా జాయింట్ కలెక్టర్ జిల్లా టి.రాహుల్ కుమార్ రెడ్డి సంయుక్తంగా పరిశీలించారు. అటవీశాఖ అధికారులను గుడ్లు సంరక్షణకు చేపట్టిన ప్రత్యేక చర్యలపై అడిగి తెలుసుకున్నారు.

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app