తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సామాన్య ప్రజలు ఆనందంలో ఉన్నారని రంగారెడ్డి జిల్లా మహిళా కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ జ్యోతి భీమ్ భరత్ అన్నారు. బుధవారం శంకర్పల్లి మున్సిపల్ పరిధి పార్టీ కార్యాలయంలో చేవెళ్ల నియోజకవర్గ బి బ్లాక్ మహిళా అధ్యక్షురాలు రమ్యశ్రీ రెడ్డి అధ్యక్షతన సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జ్యోతి, భీమ్ భరత్ హాజరై మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో పనిచేస్తున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం ఆరు గ్యారెంటీలను అమలు చేసి చూపిస్తుందన్నారు. ఈ విషయంలో ఎవరికి ఎటువంటి సందేహాలు ఉండాల్సిన అవసరం లేదన్నారు. ఉచితంగా మహిళలకు బస్సు ప్రయాణం ప్రారంభించడంతో పెద్ద ఎత్తున రాష్ట్రంలోని మహిళలు సౌకర్యాన్ని ఉపయోగించుకొని, పెద్ద ఎత్తున ఆనందపడుతున్నారన్నారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి స్పష్టంగా కనబడుతుందని వెల్లడించారు.
200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ మాఫీ చేయడం,
రూ. 500లకే సిలిండర్ అందించడం మధ్యతరగతి కుటుంబాలకు పెద్ద ఎత్తున మేలు
చేసే విధంగా ఉంటుందని ఆమె వివరించారు. ఏది ఏమైనా సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజలకు ఇచ్చిన ప్రభుత్వం ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని ఆమె పేర్కొన్నారు.
కార్యక్రమంలో జిల్లా మహిళా సెక్రెటరీ పుష్ప, మండల మహిళా అధ్యక్షురాలు నాగమణి, వైస్ ప్రెసిడెంట్ సుశీల, జనరల్ సెక్రెటరీ ప్రత్యూష రెడ్డి, మున్సిపల్ మహిళా అధ్యక్షురాలు అమృత, వైస్ ప్రెసిడెంట్ పుష్పమ్మ, సెక్రటరీలు మంజుల, అమృత, పార్టీ అధ్యక్షుడు జనార్దన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి రవీందర్ రెడ్డి, మాజీ ఎంపిటిసి ఎజాస్, నాయకులు సుధాకర్ రెడ్డి, ప్రశాంత్, అస్లాం, శారు, శివయాదవ్, శంకర్, శ్రీనివాస్, దండు శ్రీనివాస్ పాల్గొన్నారు.