SAKSHITHA NEWS

In Sai Nagar under Madapur Division Rs. Estimated cost of Rs.40.00 lakhs

సాక్షిత ; మాదాపూర్ డివిజన్ పరిధిలోని సాయి నగర్ లో రూ. 40.00 లక్షల రూపాయల అంచనావ్యయం తో చేపడుతున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులను అర్థరాత్రి ఆకస్మికంగా వెళ్లి తెల్లవారుజామున వరకు అక్కడే ఉండి స్వయంగా పరిశీలించిన ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ .

ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ ఒకవైపు కరోనా మహమ్మారి వంటి విపత్కర పరిస్థితుల్లో అభివుద్ది ఆగకూడదనే ఉద్దేశ్యం తో సంక్షేమం మరియు అభివృద్ధికి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని ముఖ్యమంత్రి కెసిఆర్ మార్గదర్శకం లో మంత్రిKTR సహకారం తో శేరిలింగంపల్లి నియోకజకర్గంను అన్ని రంగాలలో అభివృద్ధి చేసి ఆదర్శవంతమైన ,అగ్రగామి నియోజకవర్గంగా తీర్చిదితానని ప్రభుత్వ విప్ గాంధీ పేర్కొన్నారు.

అదేవిధంగా మాదాపూర్ డివిజన్ అభివృద్ధికి బాటలు వేస్తూ సీసీ రోడ్ల నిర్మాణ పనులను ప్రారంభించుకోవడం చాల సంతోషకరం విషయం అని,అర్థరాత్రి ఆకస్మికంగా వెళ్లి తెల్లవారుజామున వరకు అక్కడే ఉండి స్వయంగా నాణ్యత ప్రమాణాలను పరిశీలించడం జరిగినది అని ప్రభుత్వ విప్ గాంధీ పేర్కొన్నారు. అదేవిధంగా మాదాపూర్ డివిజన్ లో మౌలిక వసతుల కల్పనకు పెద్ద పీట వేస్తామని ,సీసీ రోడ్ల వంటి అభివృద్ధి పనులను నాణ్యత ప్రమాణాలతో చేపట్టాలని ,నాణ్యత విషయంలో ఎక్కడ రాజి పడకూడదని , ప్రజలకు ట్రాఫిక్ రహిత ,సుఖవంతమైన ,మెరుగైన రవాణా సౌకర్యం కొరకు శాయ శక్తుల కృషి చేస్తానని, ప్రజలకు స్వచ్ఛమైన, చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణం కలిపిస్తామని ప్రభుత్వ విప్ గాంధీ చెప్పడం జరిగినది.

పనుల్లో జాప్యం లేకుండా త్వరిత గతిన పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని గాంధీ అధికారులను ఆదేశించడం జరిగినది , ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం కలిపిస్తామని ,ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా సుఖవంతమైన ప్రయాణానికి బాటలు వేస్తామని ప్రభుత్వ విప్ గాంధీ చెప్పడం జరిగినది.

నియోజకవర్గ అభివృద్ధికి శాయశక్తులా కృషి చేస్తానని ,అన్నివేళలా ప్రజలకు అందుబాటులోకి ఉంటానని ,మెరుగైన ప్రజా జీవనానికి అన్ని రకాల మౌలిక వసతుల కల్పనకు తనవంతు కృషి చేస్తానని ,నియోజకవర్గాన్ని ఆదర్శవంతమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని ప్రభుత్వ విప్ గాంధీ పునరుద్ఘాటించారు.

ఈ కార్యక్రమంలో GHMC అధికారులు AE ప్రశాంత్, వర్క్ ఇన్స్పెక్టర్ చారీ, మాదాపూర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్ బీఆర్ఎస్ నాయకులు సహదేవ్ ,జైపాల్, శివ నాయక్, గోపాల్, భీము రావు, సుబ్బు, ఆనంద్ పాల్గొన్నారు.


SAKSHITHA NEWS