SAKSHITHA NEWS

నీలోఫర్ ఆస్పత్రిలో నీళ్లు లేక రోగుల తీవ్ర ఇబ్బందులు

నీళ్లు లేక నిలిచిపోయిన సర్జరీలు

నీలోఫర్లో రెండు రోజుల క్రితం సంపు వద్ద ఉన్న బోర్ పాడవడంతో అత్యవసర విభాగంలోని ఐదంతస్తులకు నీటి కొరత ఏర్పడింది. ఈ భవనంలో పిడియాట్రిక్, పిడియాట్రిక్ సర్జరీ, గైనిక్ విభాగానికి సంబంధించి ప్రసవాల గదితోపాటు నిత్యం 25 నుంచి 30 సర్జరీలు జరిగే ఆపరేషన్ థియేటర్ ఉన్నాయి.

రెండు రోజులుగా నీరందక నరకం చూసి నట్లు రోగులు, రోగి సహాయకులు ఆవేదన వ్యక్తం చేశారు.


SAKSHITHA NEWS