SAKSHITHA NEWS

Implement Rs.5/- meal scheme in Srinivas Nagar

శ్రీనివాస్ నగర్లో రూ.5/- భోజన పథకాన్ని అమలుచేయ్యండి.
సీపీఐ మండల కార్యదర్శి ఉమా మహేష్.

గాజులరామరం సర్కిల్ గాజులరామరం డివిజన్ శ్రీనివాస్ నగర్ చివరి బస్టాప్ వద్ద ప్రతిరోజు వందలాది భవన నిర్మాణ కార్మికులు అడ్డాగా ఏర్పాటు చేసుకొని పని చేస్తున్నారని ఒక్కోసారి పనిదొరక్క అక్కడే ఉంటున్నారని అలాంటివారి ఉపయోగపడే రూ.5 మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయాల్సిందిగా నేడు ఏఐటీయూసీ బృందం జోనల్ కమిషనర్ మమత ని కలిసి వినతిపత్రం ఇవ్వడం జరిగింది.


ఇక్కడ పని చెసే భవన నిర్మాణ కార్మికులకు ప్రభుత్వ గుర్తింపు కార్డ్ కూడా ఉందని వందలాది ప్రజలకు ఒక్క పూటనైనా కడుపునిండా తినే అవకాశం కల్పించవచని కావున వెంటనే రూ 5 భోజన పథకాన్ని అమలు చేయాల్సిందిగా కోరారు.
ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ అధ్యక్షుడు హరినాథ్,భవన నిర్మాణ సంఘం అధ్యక్షుడు సాయులు, ఏఐటీయూసీ నాయకులు రాములు, సదానంద,యూసుఫ్ తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS