వినాయక సాగర్ లో వ్యర్థాలను వెంటనే తొలగించండి.
*కమిషనర్ శ్రీమతి హరిత ఐఏఎస్
వినాయక నిమజ్జనం అనంతరం వినాయక సాగర్ లోని వ్యర్థాలను వెంటనే తొలగించాలని కమిషనర్ శ్రీమతి హరిత ఐఏఎస్ అధికారులను ఆదేశించారు. ఉదయం వినాయక సాగర్ ను కమిషనర్ పరిశీలించారు. వినాయక చవితి లో మూడవ రోజు ఎక్కువ విగ్రహాలు నిమజ్జనం జరిగిందని అందరూ కలసి చక్కగా పని చేశారని సిబ్బందిని అభినందించారు. ఇంకా కొన్ని విగ్రహాలు ఏడు, తొమ్మిదవ రోజు కూడా నిమజ్జనం చేస్తారని, వారికి కూడా చక్కగా ఏర్పాట్లు చేయాలని అన్నారు.
నిమజ్జనం చేసిన విగ్రహాల చెక్కలు, వ్యర్థాలు సాగర్ లేకుండా వెంటనే శుభ్రం చేయించాలని అధికారులను ఆదేశించారు. పార్కులో ఏర్పాటు చేసిన ప్రతిమలు, పూల మొక్కలు సంరక్షించేలా చూసుకోవాలని పార్కు సిబ్బందిని ఆదేశించారు. నిమజ్జనానికి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందీ లేకుండా తగు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. నిమజ్జనం లో ఎటువంటి ఇబ్బందులూ లేకుండా సహకరించిన అందరికీ కమిషనర్ కృతజ్ఞతలు తెలిపారు.