SAKSHITHA NEWS


Illegal transport of sand by pretending to be a news reporter

న్యూస్ రిపోర్టర్ అని చెప్పుకుంటూ అక్రమ ఇసుక రవాణా


సాక్షిత ప్రతినిధి.రాత్రి పగలు తేడా లేకుండా ఎలాంటి పర్మిషన్ లేకుండా సుద్ధకల్. గుండురు గ్రామాల నుంచి కల్వకుర్తికి అక్రమ ఇసుక రవాణా* నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణంలో విచ్చలవిడిగా సాగుతున్న అక్రమ ఇసుక రవాణా. ఉదయం 6 గంటల ప్రాంతంలో గుండురు.

సుద్ధకల్ గ్రామాల నుండి కల్వకుర్తి పట్టణానికి అక్రమ ఇసుక రవాణా జరుగుతుందని నమ్మదగ్గ సమాచారం మేరకు కల్వకుర్తి పట్టణంలోని నాగర్ కర్నూల్ రోడ్ వైపు ఉన్న పార్థసారధి టాకీస్ ముందర రెండు అక్రమ ఇసుక ట్రాక్టర్లను పట్టుకొని పోలీస్ వారికి సమాచారం ఇచ్చేలోపే అక్రమ ఇసుక ట్రాక్టర్లు నడిపే వ్యక్తి నేను రిపోర్టర్ అంటూ ఎవరికి చెప్పినా భయపడేది లేదంటూ రెండు అక్రమ ఇసుక టాక్టర్లు నడుపుతున్న.

మా అన్న రిపోర్టర్. మా అన్న దగ్గర రిపోర్టర్ కార్డు ఉందంటూ బుకాయించడం జరిగింది. నేను కూడా ఒక రిపోర్టర్ ని అక్రమ ఇసుక రవాణా చేస్తే తప్పేంటి అందరూ చేస్తున్నారు.

నేను చేస్తున్న అంటున్నరిపోర్టర్.Ts.31.Ta.1988.( దళిత బందులో వచ్చిన ట్రాక్టర్ లా ఉంది) రెండవ ట్రాక్టర్ మహేంద్ర నెంబర్ ప్లేట్ లేకుండా అక్రమ ఇసుక రవాణా చేస్తున్నారు. రెండు ట్రాక్టర్లు కూడా తనవే అంటున్న రిపోర్టర్. అక్రమ ఇసుక ట్రాక్టర్ల వెంట తమ కారు Ts31E9232 పంచ్ కార్ లో రిపోర్టర్ అన్ని స్టిక్కర్ వేయించుకొని అక్రమ ఇసుక ట్రాక్టర్ల ను ఇతరులు పట్టుకోకుండా అక్రమ ఇసుక రవాణా చేస్తూ ఎవరైనా పట్టుకోడానికి వస్తే నేను రిపోర్టర్ ని అనిచెప్పడంజరుగుతుంది.

ఇలాంటి వ్యక్తి పైన అధికారులు నిగా ఉంచి చర్యలు తీసుకోవాల్సిందిగా గ్రామస్తులు కోరుతున్నారు. అలాగే సుద్ధకల్. గుండురు.లో సుమారు 30.40. ట్రాక్టర్లు అక్రమ ఇసుక రవాణా చేస్తూ ఉంటాయని వారికి రాజకీయ బలం ఉంటుందని అధికారులకు ఫోన్ చేసి సమాచారం ఇచ్చిన పట్టించుకోరని కొందరు గ్రామస్తులు అంటున్నారు.


SAKSHITHA NEWS