SAKSHITHA NEWS

ప్రచురణర్థం, ప్రెస్ క్లబ్, కరీంనగర్
తేదీ: 12-09-2023.

ఖాళీ జాగాలకు ఇంటి నెంబర్లు మున్సిపల్ కార్పొరేషన్లో ఇవ్వబడును.

  • వల్లంపాడులో ఖాళీ జాగకు ఇచ్చిన ఇంటి నెంబర్లపై విచారణ జరపాలి.. ఇంటి నెంబర్లను, అక్రమ రిజిస్ట్రేషన్ లను రద్దు చేయాలి..
  • మున్సిపల్ రెవిన్యూ, టౌన్ ప్లానింగ్ అవినీతి అధికారులను సస్పెండ్ చేయాలి, వారి ఆస్తులపై సమగ్ర విచారణ చేయాలి.
    కరీంనగర్ నగరపాలక సంస్థలో భారీ కుంభకోణాలు జరుగుతున్న పట్టించుకోని మేయర్
    -సిబిసిఐడితో, ఏసిబి అధికారులతో విచారించాలి.
  • నగరపాలక సంస్థలో జరుగుతున్న అవినీతిపై జిల్లా కలెక్టర్ జోక్యం చేసుకోవాలి.
  • కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ లో విలీనమైన అన్ని గ్రామాలలో ఇదే తంతు
  • ప్రజా ప్రతినిధుల కనుసన్నల్లో జరుగుతున్నాయా? అనేక అనుమానాలు.

బండారి శేఖర్ జిల్లాప్రధాన కార్యదర్శి

మున్సిపల్ కార్పొరేషన్ 2వ డివిజన్ (వల్లంపాడు )లో ఎలాంటి ఇంటి నిర్మాణాలు లేకున్నా ఖాళీగా ఉన్న జాగాకు
కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు దాదాపు 80 నుండి 100 వరకు ఇంటి నెంబర్లు ఇవ్వడాన్ని ఆల్ ఇండియా
ఫార్వర్డ్ బ్లాక్ కరీంనగర్ జిల్లా కమిటీ తీవ్రంగా ఖండిస్తున్నది. ఈ రోజు కరీంనగర్ ప్రెస్ క్లబ్ లో అల్ఇండియఫార్వర్డ్ బ్లాక్ జిల్లా ప్రధాన కార్యదర్శి బండారిశేఖర్ విలేకురాలతో మాట్లాడుతూ వల్లంపాడు లోని సర్వే నెంబర్ 81 లో రెండు ఎకరాల
వ్యవసాయ భూమిలో ఎలాంటి నాల కన్వర్షన్ లేకుండా, లే అవుట్ లు అనుమతులు సుడా మరియు డిపిసి అనుమతులు
లేకుండానే ఖాళీ స్థలంలో ఇండ్లు ఉన్నట్లు ఇంటి నెంబర్ లు తీసుకొని అక్రమ పద్ధతిలో రిజిస్ట్రేషన్లు చేయడం ద్వారా కోట్ల
రూపాయలను ప్రభుత్వాదానికి గండి కొట్టడం జరిగింది. ఒక ఇంటికి అనుమతి ఇవ్వాలన్న, ఇంటి నెంబర్లు కేటాయించాలంటే
అనేక నిబంధనలు పాటించాల్సింది. ఇవేవీ పాటించకుండానే మున్సిపల్ అధికారులు
పెద్ద ఎత్తున డబ్బులు తీసుకొని ఎలాంటి
ఎంక్వయిరీ చేయకుండానే ఖాళీ స్థలంలో ఇండ్లు ఉన్నట్లు ఇంటి నెంబర్లు కేటాయించడం సిగ్గు చేటు. కరీంనగర్ నగరపాలక
సంస్థలో విలీనమైన 8 గ్రామాలలో ఎక్కువ చోట్ల ఖాళీ జాగలకు ఇండ్లు నిర్మాణాలు లేకున్నా ఇంటి నెంబర్లు కేటాయించడం
జరుగుతుంది. ఇది పూర్తిగా ప్రజాప్రతినిధుల కనుసన్నల్లోనే జరుగుతున్నాయని ఆరోపించారు. నగరపాలక సంస్థలోని టౌన్
ప్లానింగ్, రెవెన్యూ, ఇతర అధికారులు పూర్తిగా రియల్ ఎస్టేట్ వ్యాపారులకు, అధికార పార్టీ ప్రజా ప్రతినిధుల కనుసన్నల్లోనే
పనిచేస్తున్నారని, అక్రమ పద్ధతిలో ఇంటి నెంబర్లు, నిర్మాణ అనుమతులు ఇస్తున్నారని అన్నారు. ప్రజా ప్రతినిధులతో కుమ్మక్కై
పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలకు పాల్పడుతున్న మున్సిపల్ అధికారుల ఆస్తులపైన ఐటీ దాడులు చేయాలని ఈ సందర్భంగా
డిమాండ్ చేస్తున్నాం. ఇలాంటి అధికారులను తక్షణమే సస్పెండ్ చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. నగరపాలక సంస్థలో
ఇప్పటికే డిజిల్ కుంభకోణాలు, ఖాళీ స్థలంలో ఇండ్లు ఉన్నట్లు ఇంటి నెంబర్లు, పాత గ్రామపంచాయతీ పేర్ల మీద ఇంటి
నిర్మాణ అనుమతులు, ట్రాక్టర్ల ఇలా అనేక కుంభకోణాలు బయటకు వస్తున్నా మేయర్ ఎందుకు స్పందించడం లేదని మేం
ప్రశ్నిస్తున్నాం. ఈ కుంభకోణాలపై ప్రజల్లో అనేక అనుమానాలకు కలుగుతున్నాయని అన్నారు. నగరపాలక సంస్థను ప్రక్షాళన
చేయాలని డిమాండ్ చేయడం జరిగింది. కరీంనగర్ నగరపాలక సంస్థలో జరుగుతున్న కుంభకోణాలపై జిల్లా కలెక్టర్ గారు
ప్రత్యేక చొరవ తీసుకొని ఎంక్వయిరీ చేయాలని, బాధ్యులను తక్షణమే సస్పెండ్ చేయాలని కోరుతున్నాం. ఈ కుంభకోణాలపై
ద్వారా ఇంటిలెన్స్
నగరపాలక సంస్థ కమిషనర్, జిల్లా కలెక్టర్, సీడీఎంఏ హైదరాబాద్ ఫిర్యాదు చేస్తామని స్పందించకుంటే నగరపాలక సంస్థ
ముందు ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహిస్తామని తెలియజేశారు. ఈ కుంభకోణంపై ఏసీబీ, సీఐడీ
ద్వారా సమగ్ర విచారణ చేసి అక్రమ పద్ధతిలో ఇచ్చిన ఇంటి నెంబర్లను, రిజిస్ట్రేషన్లను కూడా రద్దుచేయాలని డిమాండ్ చేశారు.
ఈ సమావేశంలో ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ నగర కార్యదర్శి వసీం అహ్మద్, జిల్లా కమిటీ సభ్యులు కురువెల్లి శంకర్,
ప్రశాంత్, నాయకులు అస్తపురం విక్రమ్, బద్రి నేత, అరుణ్, అంజలి, రాజు, తదితరులు పాల్గొన్నారు.

బండారి శేఖర్
జిల్లా ప్రధాన కార్యదర్శి
అల్ ఇండియ ఫార్వర్డ్ బ్లాక్
కరీంనగర్


SAKSHITHA NEWS