Illegal cases against Congress party leaders without looking into judicial injustices
న్యాయ అన్యాయాలు పరిశీలించకుండానే కాంగ్రెస్ పార్టీ నాయకులపై అక్రమ కేసులు. అధికార పార్టీ నాయకులకు తొత్తులుగా పోలీసుల వ్యవహారం.మాజీ ఎమ్మెల్యే వంశి చంద్ రెడ్డి సతీమణి చెల్లా ఆశ్లేష రెడ్డి.
సాక్షిత : నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి నియోజకవర్గం లోని వెల్దండ మండలం లోని గత రెండు రోజుల క్రితం టిఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలో మధ్య జరిగిన ఘటన ఇరు పార్టీ లు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసుకున్నారు.
అధికార పార్టీకి సంబంధించిన టిఆర్ఎస్ పార్టీ నాయకు లను వెంటనే అరెస్ట్ చేయకుండా పంపించడం అలాగే ప్రతిపక్ష పార్టీలైన కాంగ్రెస్ నాయకులను అక్రమంగా అరెస్ట్ చేసి రిమాండ్ చేయడం దుర్మార్గపు చర్య అని కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే చల్లా వంశీచంద్ రెడ్డి సతీమణి చల్లా అశ్లేష రెడ్డి అన్నారు.
వెల్దండ మండలంలోని శ్రీశైలం హైదరాబాద్ జాతీయ రహదారిపై కాంగ్రెస్ నాయకులు మద్దతుగా ధర్నా చేయటానికి సిద్ధమవుతుండగా పోలీసులు అడ్డుకొని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కి తరలించారు. ఈ సందర్భంగా ఆశ్లేష రెడ్డి మాట్లాడుతూ పోలీసులు టిఆర్ఎస్ ప్రభుత్వం నికి వత్తాసు పలుకుతున్నారని అన్నారు.
ఈ తెలంగాణలో ప్రజాస్వామ్యం లేదని ప్రతిపక్ష పార్టీలను అధికార పార్టీ తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తుంది అని రాబోయే రోజుల్లో తెలంగాణ ప్రభుత్వానికి ప్రజలే తగిన గుణపాఠం చెప్తారని అన్నారు. వెంటనే కాంగ్రెస్ పార్టీ నాయకులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు.